BREAKING
రెవెన్యూ మరియు సర్వే సేవల ప్రగతిపై సమీక్షా సమావేశం సంజీపురం సర్పంచ్ అభ్యర్థిగా శ్రీలక్ష్మి ఘనంగా నామినేషన్ దాఖలు* కోనసీమ జిల్లాలో అదుపులోకి వచ్చిన గ్యాస్ బ్లో అవుట్.. విద్యార్థినులు బేసిక్ ఇంగ్లీష్ మాట్లాడేలా ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి మంత్రి పొన్నం ప్రభాకర్ జోనల్, రూట్ ఆఫీసర్లు పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేయాలి ఇళ్ళస్థలాల సాధనకై 20న గ్రేటర్ జర్నలిస్టుల మహా ధర్నా తిరుపతి కపిలేశ్వరాలయంలో వైభవంగా శ్రీ కాలభైరవ హోమం తిరుపతి కపిలేశ్వరాలయంలో వైభవంగా శ్రీ కాలభైరవ హోమం అర్హులైన ప్రతి ఒక్కరికీ చేయూత పెన్షన్లు అందిస్తాం: స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ బంగాళాఖాతంలో 'అక్వాన్' తుఫాన్ అలజడి.. సాయంత్రానికి తీవ్ర తుఫాన్‌గా మారే అవకాశం విద్యార్థులు భవిష్యత్తులో అన్ని రంగాల్లో ఉన్నత శిఖరాలను అధిరోహించాలి గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ చాలా ఇష్టంతో బిజిలీ పాత్ర చేశా.. ఆకాశంలో ఒక తార మూవీపై రుహానీ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు టెక్కలి సర్పంచ్ బరిలో కోళ్ల లవకుమార్: రాజకీయ మెలుకువలు, అభివృద్ధి పట్టుతో ముందడుగు! ఫీల్డ్ అసిస్టెంట్‌ను తొలగించాలని కూలీల డిమాండ్ మాతృభాషపై మమకారం పెంచుకోవాలి

అర్హులైన ప్రతి ఒక్కరికీ చేయూత పెన్షన్లు అందిస్తాం: స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్

Select Suryaa Now
అర్హులైన ప్రతి ఒక్కరికీ చేయూత పెన్షన్లు అందిస్తాం: స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్

బంట్వారం, మేజర్ న్యూస్: అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని తెలంగాణ శాసనసభ స్పీకర్, వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. మంగళవారం బంట్వారం మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పురుషోత్తం రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన చేయూత పెన్షన్ మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేశారు.ఈ సందర్భంగా స్పీకర్   మాట్లాడుతూ… ఈ నెల 19న సిద్దిపేటలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇందిరమ్మ జీవిత బీమా పథకాన్ని ప్రారంభించనున్నారని తెలిపారు. కులం, మతం, ఆదాయంతో సంబంధం లేకుండా ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా కల్పించనున్నట్లు వెల్లడించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు ముఖ్యమంత్రి ప్రతిరోజూ 18 గంటల పాటు నిరంతరం కష్టపడుతున్నారని పేర్కొన్నారు.గత ప్రభుత్వ హయాంలో పెన్షన్ల కోసం ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని, పెన్షన్ పొందడం అనేది లబ్ధిదారుల 12 ఏళ్ల కల అని అన్నారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అర్హులైన వారికి పెన్షన్లు అందిస్తున్నామని, ఇంకా ఎవరైనా అర్హులు ఉంటే నిరాశ చెందవద్దని, ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు.ప్రజా ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను అమలు చేస్తోందని, గత ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీలు చెల్లిస్తూనే సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగిస్తున్నామని తెలిపారు. పార్టీలకు అతీతంగా అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందించడమే తన ధ్యేయమని స్పష్టం చేశారు.వికారాబాద్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని, ఇప్పటికే సుమారు రూ.1,000 కోట్ల నిధులతో రహదారుల అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. అన్ని గ్రామాలు, మండలాలకు రహదారులతో పాటు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. రైతుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని, ముఖ్యమంత్రి ఇప్పటికే రూ.2 లక్షల వరకు రైతు రుణమాఫీ చేసి ఇచ్చిన హామీని నెరవేర్చారని పేర్కొన్నారు.ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా అర్హులైన మహిళలకు ఇళ్లు అందిస్తున్నామని, ఇళ్లు మంజూరు కానివారు మరోసారి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇళ్లు అందేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజలు సహకరించాలని, ముఖ్యమంత్రితో పాటు తనకు కూడా ప్రజల ఆశీస్సులు, మద్దతు అందించాలని కోరారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు, సర్పంచులు, కార్యకర్తలు, పెన్షన్ లబ్ధిదారులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.