BREAKING
విద్యార్థులు భవిష్యత్తులో అన్ని రంగాల్లో ఉన్నత శిఖరాలను అధిరోహించాలి గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ చాలా ఇష్టంతో బిజిలీ పాత్ర చేశా.. ఆకాశంలో ఒక తార మూవీపై రుహానీ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు టెక్కలి సర్పంచ్ బరిలో కోళ్ల లవకుమార్: రాజకీయ మెలుకువలు, అభివృద్ధి పట్టుతో ముందడుగు! ఫీల్డ్ అసిస్టెంట్‌ను తొలగించాలని కూలీల డిమాండ్ మాతృభాషపై మమకారం పెంచుకోవాలి పాఠశాలను, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన ఆర్డీవో. ఉత్సాహంగా కొనసాగుతున్న గ్రంథాలయ వారోత్సవాలు...! మమ్ముట్టి గారూ ఆ చిన్న విన్నపం.. ధనుష్ ఫన్నీ కామెంట్స్ వైరల్ 400 ఎకరాల ప్రభుత్వ భూమికి పక్కాగా హద్దులు.. రీ-సర్వేలో నిర్లక్ష్యం వద్దు: కలెక్టర్ దీపక్ తివారి హైదరాబాద్ చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి వత్సవాయి మండలంలో గ్రామపంచాయతీ ఎన్నికలకు 9 నామినేషన్ స్వీకరణ కేంద్రాలు మండపేట లో వన సమారాధన మహోత్సవం ఐపీఎల్‌కు ఎంఎస్ ధోనీ వీడ్కోలు.. సీఎస్కే మెంటార్‌గా కొత్త ఇన్నింగ్స్! అల్లు అర్జున్ అక్క ఈమేనంటూ స్టేజ్‌పై పరిచయం చేసిన అల్లు అరవింద్.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో! గుమ్మగట్ట కేజీబీవీ విద్యార్థులకు అస్వస్థత.

మాతృభాషపై మమకారం పెంచుకోవాలి

Select Suryaa Now
మాతృభాషపై మమకారం పెంచుకోవాలి

సత్తెనపల్లి, మేజర్ న్యూస్ : తెలుగు భాషపై ప్రతి ఒక్కరూ మమకారం పెంచుకోవాలని, మాతృభాషలోని మాధుర్యాన్ని, కవిత్వంలోని గొప్పతనాన్ని విద్యార్థులు అర్థం చేసుకొని సాహిత్యంపై ఆసక్తి పెంచుకోవాలని విశ్రాంత తెలుగు పండితులు, కవి, ప్రవచనకర్త మంచి కంటి వేంకటేశ్వరరావు అన్నారు. భాష అనేది భావాలను వ్యక్తపరిచే సాధనం మాత్రమే కాదని, మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతిబింబమని పేర్కొన్నారు.59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా మంగళవారం శాఖా గ్రంథాలయంలో తెలుగు భాష, కవిత్వం, కవుల గురించి ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.గ్రంథాలయాధికారి కె.ఎస్.ఎస్. ప్రసాద్  ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన వెంకటేశ్వరరావు విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. తెలుగు భాషా గొప్పతనం, కవిత్వంలోని భావగాంభీర్యం, రచనల ప్రాధాన్యత, కవుల సాహిత్య సేవలను వివరించారు. విద్యార్థులు పుస్తక పఠనాన్ని అలవాటు చేసుకోవడంతో పాటు సృజనాత్మక రచనలపై ఆసక్తి పెంచుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో విశ్రాంత అధ్యాపకులు కె. ఉమామహేశ్వరరావు, చి. అంకయ్య, , సిబ్బంది ఎన్. రమేష్, పాఠశాల విద్యార్థులు, పాఠకులు పాల్గొన్నారు.

గన్నవరం ఏలియ, సత్తెనపల్లి ఇన్ఛార్జ్