BREAKING
చాలా ఇష్టంతో బిజిలీ పాత్ర చేశా.. ఆకాశంలో ఒక తార మూవీపై రుహానీ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు టెక్కలి సర్పంచ్ బరిలో కోళ్ల లవకుమార్: రాజకీయ మెలుకువలు, అభివృద్ధి పట్టుతో ముందడుగు! ఫీల్డ్ అసిస్టెంట్‌ను తొలగించాలని కూలీల డిమాండ్ మాతృభాషపై మమకారం పెంచుకోవాలి పాఠశాలను, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన ఆర్డీవో. ఉత్సాహంగా కొనసాగుతున్న గ్రంథాలయ వారోత్సవాలు...! మమ్ముట్టి గారూ ఆ చిన్న విన్నపం.. ధనుష్ ఫన్నీ కామెంట్స్ వైరల్ 400 ఎకరాల ప్రభుత్వ భూమికి పక్కాగా హద్దులు.. రీ-సర్వేలో నిర్లక్ష్యం వద్దు: కలెక్టర్ దీపక్ తివారి హైదరాబాద్ చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి వత్సవాయి మండలంలో గ్రామపంచాయతీ ఎన్నికలకు 9 నామినేషన్ స్వీకరణ కేంద్రాలు మండపేట లో వన సమారాధన మహోత్సవం ఐపీఎల్‌కు ఎంఎస్ ధోనీ వీడ్కోలు.. సీఎస్కే మెంటార్‌గా కొత్త ఇన్నింగ్స్! అల్లు అర్జున్ అక్క ఈమేనంటూ స్టేజ్‌పై పరిచయం చేసిన అల్లు అరవింద్.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో! గుమ్మగట్ట కేజీబీవీ విద్యార్థులకు అస్వస్థత. కేటీఆర్‌ను కలిసిన మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్

400 ఎకరాల ప్రభుత్వ భూమికి పక్కాగా హద్దులు.. రీ-సర్వేలో నిర్లక్ష్యం వద్దు: కలెక్టర్ దీపక్ తివారి

Select Suryaa Now
400 ఎకరాల ప్రభుత్వ భూమికి పక్కాగా హద్దులు.. రీ-సర్వేలో నిర్లక్ష్యం వద్దు: కలెక్టర్ దీపక్ తివారి

బషీరాబాద్, మేజర్ న్యూస్: ప్రభుత్వ భూముల పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ నవాద్గి గ్రామంలోని 400 ఎకరాల ప్రభుత్వ భూమి హద్దులను కచ్చితంగా గుర్తించాలని జిల్లా కలెక్టర్ దీపక్ తివారి రెవెన్యూ అధికారులను ఆదేశించారు. మంగళవారం బషీరాబాద్ మండల పరిధిలోని నవాద్గి గ్రామంలో కొనసాగుతున్న భూముల రీ-సర్వే ప్రక్రియను ఆయన ఆకస్మికంగా పరిశీలించారు.ఈ సందర్భంగా సర్వే పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ భూముల హద్దులను పక్కాగా నిర్ధారించి, ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా రీ-సర్వే నిర్వహించాలని సూచించారు. సర్వే ప్రక్రియలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రైతుల సహకారంపై స్థానిక సర్పంచ్ శ్రీకాంత్‌ను అడిగి వివరాలు తెలుసుకున్నారు.రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రీ-సర్వేను విజయవంతం చేసేందుకు పట్టాదారు రైతులు, గ్రామ ప్రజలు అధికారులకు పూర్తి సహకారం అందించాలని కలెక్టర్ కోరారు. ప్రభుత్వ భూముల పరిరక్షణలో అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ శ్రీకాంత్, తహసీల్దార్ షాహిదా బేగం, సర్వేయర్, ఆర్‌ఐ నాగార్జున రెడ్డి, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.