BREAKING
గ్రంధాలయాల వారోత్సవాలులో వివిధ క్రీడా పోటీలు ధారూర్‌లో చేయూత పెన్షన్ మంజూరు పత్రాల పంపిణీ కరువు సమయంలో ప్రభుత్వ సొమ్ము దుబారా.. ఐదు రోజుల్లో షాబాద్ మండలంలో ఇంటింటి సర్వే పూర్తిచేయాలి : కలెక్టర్ నారాయణ రెడ్డి భక్తులకు పండ్లు అందజేసిన మున్నూరు కాపు సంఘం పటేల్స్ నాయకులు. *6 నెలల్లో సమీకృత పశు వసతి కేంద్రాల ఏర్పాటు ప్రక్రియ పూర్తి చేయాలి* *పశుసంపద అభివృద్ధి, మహిళా సాధికారతే లక్ష్యంగా సమీకృత పశుసంవర్ధక కేంద్రాల ఏర్పాటు* *జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి* అర్హులైన ప్రతి ఒక్కరికీ చేయూత పెన్షన్.. అభివృద్ధి, సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ వృద్ధాప్య పింఛన్లు కూడా త్వరలో ఇవ్వాలి: ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి రబీ 2026-27 సీజన్‌లో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద పంటలకు బీమా సౌకర్యం* *తక్కువ ప్రీమియంతో పంటలకు ఆర్థిక భద్రత – రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి* *కలెక్టరేట్‌లో పంటల బీమా పథకం పోస్టర్‌ను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి* యాదాద్రి వెలుగులతో తెలంగాణ విద్యుత్ రంగానికి కొత్త బలం! కాంగ్రెస్ జిల్లా అధికార ప్రతినిధిగా సామల కృష్ణారెడ్డి నియామకం సమ్మక్క సాగర్ బ్యారేజీకి మార్గం సుగమం.. ఎన్‌ఓసీపై ఛత్తీస్‌గఢ్ సీఎం సానుకూలం! పేదల కళ్లలో ఆనందం.. ప్రజాప్రభుత్వ సంక్షేమం ఈ శతాబ్దపు అతిపెద్ద మోసం కాంగ్రెస్ ‘అభయహస్తం’ రాజన్న ఆలయ గోపురాన్ని ముట్టుకుంటే సహించం: భాజపా

ఐదు రోజుల్లో షాబాద్ మండలంలో ఇంటింటి సర్వే పూర్తిచేయాలి : కలెక్టర్ నారాయణ రెడ్డి

Select Suryaa Now
ఐదు రోజుల్లో షాబాద్ మండలంలో ఇంటింటి సర్వే పూర్తిచేయాలి : కలెక్టర్ నారాయణ రెడ్డి

షాబాద్ : షాబాద్ మండలాన్ని ఉల్లాస్ – నవ భారత్ సాక్షరతా కార్యక్రమం ద్వారా రాష్ట్రంలోనే తొలి 100 శాతం అక్షరాస్య మండలంగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ లక్ష్య సాధనలో భాగంగా మండలంలోని 41 గ్రామ పంచాయతీల పరిధిలో ఇంటింటి సర్వేను ఐదు రోజుల్లోగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. సీఈపీసీ సర్వే ప్రకారం షాబాద్ మండలంలో మొత్తం 15,507 కుటుంబాలు ఉన్నాయని కలెక్టర్ తెలిపారు. ఈ కుటుంబాలను అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, సెర్ప్ ఓఎస్, వీబీ -జి  రామ్ జి సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులకు సమానంగా కేటాయించి, ప్రతి ఇంటిని సందర్శించి నిరక్షరాస్యులను గుర్తించాలని సూచించారు. ఈ సర్వేకు ఎంపీడీఓను మండల స్థాయి సమగ్ర పర్యవేక్షణ అధికారిగా నియమించారు. MRO, MEO, CDPO, APM-SERP, APO-MGNREGS అధికారులు తమ పరిధిలోని సిబ్బందిని వెంటనే కేటాయించి, నిర్ణీత గడువులోగా సర్వే పూర్తయ్యేలా సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. సర్వేలో భాగంగా 15 సంవత్సరాలు నిండిన ప్రతి నిరక్షరాస్యుడిని గుర్తించి వయోజన విద్యాశాఖ రూపొందించిన ప్రొఫార్మాలో వివరాలు నమోదు చేయాలని కలెక్టర్ సూచించారు. ముఖ్యంగా 15 నుంచి 60 సంవత్సరాల మధ్య వయస్సు గల నిరక్షరాస్యులందరి వివరాలను ఉల్లాస్ యాప్‌లో తప్పనిసరిగా నమోదు చేయాలని స్పష్టం చేశారు. సర్వే పూర్తయిన వెంటనే గ్రామాల్లో అక్షర కేంద్రాలను ఏర్పాటు చేసి, వాలంటీర్లు, కార్పొరేట్ సంస్థల సామాజిక బాధ్యత (CSR) సహకారంతో బోధనా కార్యక్రమాలను ప్రారంభించాలని తెలిపారు. ప్రతి ఒక్కరికీ చదవడం, రాయడం నేర్పించి అక్షరాస్యులుగా తీర్చిదిద్దడమే ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. సంబంధిత శాఖల అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది సమష్టి కృషితో షాబాద్ మండలాన్ని 100 శాతం అక్షరాస్య మండలంగా నిలపాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాన్ని అత్యంత ప్రాధాన్యతతో చేపట్టి విజయవంతం చేయాలని ఆదేశించారు. సర్వేకు అవసరమైన ప్రొఫార్మా, శిక్షణ, సాంకేతిక సహకారాన్ని జిల్లా వయోజన విద్యా ఉప సంచాలకులు కె. అనిత అందిస్తారని తెలిపారు.

శివరాజ్ : షాబాద్ - మేజర్ న్యూస్