BREAKING
వత్సవాయి మండలంలో గ్రామపంచాయతీ ఎన్నికలకు 9 నామినేషన్ స్వీకరణ కేంద్రాలు మండపేట లో వన సమారాధన మహోత్సవం ఐపీఎల్‌కు ఎంఎస్ ధోనీ వీడ్కోలు.. సీఎస్కే మెంటార్‌గా కొత్త ఇన్నింగ్స్! అల్లు అర్జున్ అక్క ఈమేనంటూ స్టేజ్‌పై పరిచయం చేసిన అల్లు అరవింద్.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో! గుమ్మగట్ట కేజీబీవీ విద్యార్థులకు అస్వస్థత. కేటీఆర్‌ను కలిసిన మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ గ్రంధాలయాల వారోత్సవాలులో వివిధ క్రీడా పోటీలు ధారూర్‌లో చేయూత పెన్షన్ మంజూరు పత్రాల పంపిణీ కరువు సమయంలో ప్రభుత్వ సొమ్ము దుబారా.. ఐదు రోజుల్లో షాబాద్ మండలంలో ఇంటింటి సర్వే పూర్తిచేయాలి : కలెక్టర్ నారాయణ రెడ్డి భక్తులకు పండ్లు అందజేసిన మున్నూరు కాపు సంఘం పటేల్స్ నాయకులు. *6 నెలల్లో సమీకృత పశు వసతి కేంద్రాల ఏర్పాటు ప్రక్రియ పూర్తి చేయాలి* *పశుసంపద అభివృద్ధి, మహిళా సాధికారతే లక్ష్యంగా సమీకృత పశుసంవర్ధక కేంద్రాల ఏర్పాటు* *జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి* అర్హులైన ప్రతి ఒక్కరికీ చేయూత పెన్షన్.. అభివృద్ధి, సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ వృద్ధాప్య పింఛన్లు కూడా త్వరలో ఇవ్వాలి: ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి రబీ 2026-27 సీజన్‌లో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద పంటలకు బీమా సౌకర్యం* *తక్కువ ప్రీమియంతో పంటలకు ఆర్థిక భద్రత – రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి* *కలెక్టరేట్‌లో పంటల బీమా పథకం పోస్టర్‌ను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి*

కరువు సమయంలో ప్రభుత్వ సొమ్ము దుబారా..

Select Suryaa Now
కరువు సమయంలో ప్రభుత్వ సొమ్ము దుబారా..
హైదరాబాద్: రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలనపై మరియు నిధుల కేటాయింపులపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. సోనియా గాంధీ గుండెల్లో తెలంగాణ ఎప్పుడూ లేదని, కేవలం తెలంగాణ ప్రజల సుదీర్ఘ పోరాటం, ఉద్యమ తీవ్రత కారణంగానే అనివార్య పరిస్థితుల్లో ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చారని ఆయన పేర్కొన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన కేటీఆర్, ప్రస్తుత ప్రభుత్వం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు.

రాష్ట్రంలో కరువు పరిస్థితులు నెలకొన్న క్లిష్ట సమయంలో ప్రభుత్వం ప్రజా సొమ్మును దుబారా చేస్తోందని కేటీఆర్ మండిపడ్డారు. రూ. 100 కోట్ల ప్రజాధనంతో 'భారత్ సమ్మిట్' నిర్వహించి రాష్ట్ర ప్రజలకు ఏం సాధించారని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలోని మిగిలిన నియోజకవర్గాలను విస్మరించి, ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్‌కు మాత్రమే ఏకంగా రూ. 9 వేల కోట్ల నిధులను తరలించారని కేటీఆర్ ఆరోపించారు.

సాగునీటి నిర్వహణలోనూ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, మేడిగడ్డ వద్ద ఉన్న నీటిని ఒడిసిపట్టి రైతులకు అందించడంలో సర్కారు చేతులెత్తేసిందని ఆయన విమర్శించారు. ఒకవైపు ప్రజలు, రైతులు కరువుతో అల్లాడుతుంటే, మరోవైపు ప్రభుత్వం మూసీ సుందరీకరణ పేరుతో హడావుడి చేస్తోందని దుయ్యబట్టారు. మూసీ సుందరీకరణ ప్రాజెక్టుకు 10 టీఎంసీల నీరు అవసరమవుతుందని ప్రస్తావిస్తూ, కరువు వేళ మూసీ సుందరీకరణ చేపట్టడం ఒక పిచ్చి పని అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.