కేటీఆర్‌ను కలిసిన మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్
వికారాబాద్ జిల్లా ప్రతినిధి, మేజర్ న్యూస్ : బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్)ను వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ మంగళవారం తెలంగాణ భవన్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వికారాబాద్ జిల్లాలో నెలకొన్న ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణ తదితర అంశాలపై ఇరువురు సుదీర్ఘంగా చర్చించారు. జిల్లాలో పార్టీని మరింత బలోపేతం చేయడం, ప్రజా సమస్యలపై పార్టీ తరఫున అనుసరించాల్సిన వ్యూహాలు, క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాల్సిన అంశాలపై అభిప్రాయాలు పంచుకున్నట్లు తెలిసింది. ఈ భేటీ వికారాబాద్ జిల్లా బీఆర్ఎస్ రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది.