BREAKING
చాలా ఇష్టంతో బిజిలీ పాత్ర చేశా.. ఆకాశంలో ఒక తార మూవీపై రుహానీ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు టెక్కలి సర్పంచ్ బరిలో కోళ్ల లవకుమార్: రాజకీయ మెలుకువలు, అభివృద్ధి పట్టుతో ముందడుగు! ఫీల్డ్ అసిస్టెంట్‌ను తొలగించాలని కూలీల డిమాండ్ మాతృభాషపై మమకారం పెంచుకోవాలి పాఠశాలను, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన ఆర్డీవో. ఉత్సాహంగా కొనసాగుతున్న గ్రంథాలయ వారోత్సవాలు...! మమ్ముట్టి గారూ ఆ చిన్న విన్నపం.. ధనుష్ ఫన్నీ కామెంట్స్ వైరల్ 400 ఎకరాల ప్రభుత్వ భూమికి పక్కాగా హద్దులు.. రీ-సర్వేలో నిర్లక్ష్యం వద్దు: కలెక్టర్ దీపక్ తివారి హైదరాబాద్ చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి వత్సవాయి మండలంలో గ్రామపంచాయతీ ఎన్నికలకు 9 నామినేషన్ స్వీకరణ కేంద్రాలు మండపేట లో వన సమారాధన మహోత్సవం ఐపీఎల్‌కు ఎంఎస్ ధోనీ వీడ్కోలు.. సీఎస్కే మెంటార్‌గా కొత్త ఇన్నింగ్స్! అల్లు అర్జున్ అక్క ఈమేనంటూ స్టేజ్‌పై పరిచయం చేసిన అల్లు అరవింద్.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో! గుమ్మగట్ట కేజీబీవీ విద్యార్థులకు అస్వస్థత. కేటీఆర్‌ను కలిసిన మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్

హైదరాబాద్ చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి

Select Suryaa Now
హైదరాబాద్ చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తన ఛత్తీస్‌గఢ్ పర్యటనను ముగించుకుని మంగళవారం హైదరాబాద్ చేరుకున్నారు. రాయ్‌పూర్ నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న ముఖ్యమంత్రికి పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు మరియు ఉన్నతాధికారులు ఘనస్వాగతం పలికారు. సీఎం వెంట రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా హైదరాబాద్ తిరిగి వచ్చారు.

ఈ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాయ్‌పూర్‌లో ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయితో ప్రత్యేకంగా సమావేశమైన విషయం తెలిసిందే. రాష్ట్ర సాగునీటి రంగంలో కీలకమైన సమ్మక్క సాగర్ బ్యారేజీకి నిరభ్యంతర పత్రం (NOC) జారీ చేయడంతో పాటు, పెండింగ్ అనుమతులను త్వరగా పూర్తి చేయాలని ఈ భేటీలో సీఎం కోరారు. దీనికి ఛత్తీస్‌గఢ్ సీఎం సానుకూలంగా స్పందించి, ఎన్‌ఓసీ ప్రక్రియను వేగవంతం చేస్తామని హామీ ఇవ్వడంతో తెలంగాణ ప్రభుత్వానికి పెద్ద ఊరట లభించినట్లయింది. ఈ పర్యటన విజయవంతం కావడంపై రాష్ట్ర అధికార వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది.