ఫీల్డ్ అసిస్టెంట్‌ను తొలగించాలని కూలీల డిమాండ్
సూర్య బెజ్జుర్ : కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా, బెజ్జూర్ మండలం మార్తిడి జీపీలో ఉపాధి హామీ పనులపై కూలీలు ఫిర్యాదు చేశారు. కూలీల వద్ద డబ్బులు వసూలు చేస్తూ, పనులు కల్పించకుండానే కల్పించడం లేదని, ఆరోపించారు. ఫీల్డ్ అసిస్టెంట్ విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్నారని పేర్కొన్నారు. వెంటనే ఎంపీడీఓ క్షేత్రస్థాయిలో విచారణ జరిపి, ఆరోపణలు నిజమని తేలితే ఫీల్డ్ అసిస్టెంట్‌ను తొలగించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కూలీలు డిమాండ్ చేశారు.