విద్యార్థులు భవిష్యత్తులో అన్ని రంగాల్లో ఉన్నత శిఖరాలను అధిరోహించాలి గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్
గుంటూరు : గుంటూరు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమాల్లో భాగంగా సెప్టెంబర్ 26, 27 వ తేదీలలో పోలీస్ సిబ్బంది పోలీస్ కుటుంబాలకు చెందిన చిన్నారులు, ఇతర పాఠశాలలు, కళాశాలల విద్యార్థులకు వ్యాసరచన, ఉపన్యాసం (ఎలక్యూషన్), చిత్రలేఖనం (పెయింటింగ్) పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచి విజేతలుగా నిలిచిన పోలీస్ సిబ్బంది, పోలీస్ కుటుంబాల చిన్నారులు, పాఠశాలలు, కళాశాలల విద్యార్థులకు మంగళవారం గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ చేతుల మీదుగా నగదు బహుమతులు, అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో భాగంగా నిర్వహించిన వివిధ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొని విజేతలుగా నిలిచిన పోలీస్ సిబ్బంది, విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు. విద్యార్థులు చిన్ననాటి నుంచే తమలోని సృజనాత్మకత, ప్రతిభను వెలికితీసుకుంటూ చదువుతో పాటు అన్ని రంగాల్లో నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు. భవిష్యత్తులో ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని, కష్టపడి చదివి అన్ని రంగాల్లో రాణిస్తూ గొప్ప వ్యక్తులుగా ఎదగాలని ఆకాంక్షించారు.
వ్యాసరచన (Essay Writing) విభాగంలో బహుమతులు పొందిన వారిలో పోలీస్ సిబ్బంది 1. ఎన్. కాంత కుమారి మహిళా కానిస్టేబుల్ స్పెషల్ బ్రాంచ్, 2. పి. అరుణకుమారి సైబర్ సెల్ విభాగం, 3. బి. జాస్మిన్ ట్రైనింగ్ కానిస్టేబుల్, అలాగే పోలీస్ కుటుంబాల చిన్నారులు 1. షేక్ ఫర్వాజ్ అహ్మద్, 2. టి. శ్వేత. విజ్ఞాన్ లారా గుంటూరు, 3. ఎస్.కె సభనo జెకెసి కాలేజ్, పాఠశాల విద్యార్థులు కె. కార్తికేయ నవీన్ విద్యానికేతన్ నల్లపాడు బి. దీపు – రవీంద్ర భారతి స్కూల్, తాడేపల్లి, టి.బి.వి.ఎన్. సౌ. అశోక హై స్కూల్ పెదనందిపాడు. అదేవిధంగా
ఉపన్యాసం (ఎలోక్యూషన్ ) విభాగంలో బహుమతులు పొందిన వారిలో పోలీస్ సిబ్బంది బి. జాస్మిన్,
టి. అరుణకుమారి,
ఎన్. కాంతకుమారి, పోలీస్ కుటుంబాల చిన్నారులలో
కె. రాజేష్ గౌడ్, ఎం. శాలిని విట్ కాలేజ్, ఎస్.కె. పర్వాజ్ అహ్మద్, పాఠశాలలు, కళాశాలల విద్యార్థులలో
కె. కార్తికేయ నవీన హై స్కూల్, నల్లపాడు, ఎం. శ్రీదేవి – గర్ల్స్ హై స్కూల్, తెనాలి, ఎస్.కె. సుమయ జి.సి.ఎస్. జూనియర్ కాలేజ్, చిత్రలేఖనం (పెయింటింగ్ ) విభాగంలో బహుమతులు పొందిన వారిలో
పోలీస్ సిబ్బంది టి. అరుణకుమారి, ఎన్. కాంత కుమారి, పోలీస్ కుటుంబాల చిన్నారులలో టి. భవ్యశ్రీ లిటిల్ పవర్ స్కూల్, ఎం. శాలిని విట్ కాలేజ్, ఎం.వి. మంజుష విట్ కాలేజ్, పాఠశాలలు, కళాశాలల విద్యార్థులలో
టి. మోక్ష శ్రీ లోటస్ హై స్కూల్,
యుగ్మాప్రియ – ఆపిల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ మేడికొండూరు, ఎన్. భవాని జడ్పీ హైస్కూల్, గారపాడు బహుమతులు అందుకున్న వారిలో ఉన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్మ్డ్ రిజర్వుడు డీఎస్పీ సంకురయ్య, వెల్ఫేర్ ఆర్.ఐ. సురేష్, అడ్మిన్ ఆర్.ఐ. కృష్ణయ్య, ఎం.టి. ఆర్.ఐ.శ్రీ హరి రెడ్డి, పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
కే నాగరాజు గుంటూరు క్రైమ్