తిరుపతి కపిలేశ్వరాలయంలో వైభవంగా శ్రీ కాలభైరవ హోమం
తిరుపతి కపిలేశ్వరాలయంలో వైభవంగా శ్రీ కాలభైరవ హోమం
*శాస్త్రోక్తంగా అష్టభైరవ హోమం, మహాపూర్ణాహుతి – శ్రీ కాలభైరవ స్వామివారికి కలశాభిషేకం
తిరుపతి బ్యూరో, మేజర్ న్యూస్: తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో జరుగుతున్న కార్తీక మాస హోమ మహోత్సవాల్లో భాగంగా మంగళవారం శ్రీ కాలభైరవ హోమం భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఉదయం 9 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు యాగశాలలో శాస్త్రోక్తంగా పూజలు, అష్టభైరవ హోమం, మహాపూర్ణాహుతి, కలశ ఉద్వాసన, మహాశాంతి అభిషేకం నిర్వహించారు. అనంతరం శ్రీ కాలభైరవ స్వామివారి మూలవిరాట్టుకు కలశాభిషేకం, నివేదన, హారతి సమర్పించారు.
సాయంత్రం శ్రీ కామాక్షి అమ్మవారికి విశేష పూజలు
మంగళవారం సాయంత్రం 6 నుండి రాత్రి 8.30 గంటల వరకు శ్రీ కామాక్షి అమ్మవారికి కలశ స్థాపన, పూజ, జపం, హోమం, విశేష దీపారాధన నిర్వహించనున్నారు.
నవంబరు 18 నుండి 26 వరకు శ్రీ కామాక్షి అమ్మవారి చండీయాగం
----------
కార్తీక మాస హోమ మహోత్సవాల్లో భాగంగా నవంబరు 18 నుండి 26వ తేదీ వరకు శ్రీ కామాక్షి అమ్మవారి పేరిట చండీయాగం నిర్వహించనున్నారు.
Raaju బ్యూరో, తిరుపతి జిల్లా