BREAKING
కరీనా కపూర్, హృతిక్ రోషన్ మళ్లీ కలుస్తున్నారు: పాతికేళ్ల తర్వాత తెరపై మ్యాజిక్! శ్రీకాళహస్తి ప్రాంతంలో ఎరువులు పంపిణీ పై అవగాహన. పవన్ తో నేరుగా మాట్లాడే నేత... సొంత ఊరి లో భంగపాటు సమాచార హక్కు చట్టంపై అధికారులకు ప్రత్యేక శిక్షణ స్వీట్లపై ప్రమాదకర అల్యూమినియం రేపర్ల వినియోగం.. హైదరాబాద్‌లో నకిలీ సిల్వర్ రేపర్స్ ముఠా గుట్టురట్టు! తెలంగాణను దేశంలోనే అత్యుత్తమ స్పోర్ట్స్ హబ్‌గా మారుద్దాం మంత్రి వాకిటి శ్రీహరి రెవెన్యూ మరియు సర్వే సేవల ప్రగతిపై సమీక్షా సమావేశం సంజీపురం సర్పంచ్ అభ్యర్థిగా శ్రీలక్ష్మి ఘనంగా నామినేషన్ దాఖలు* కోనసీమ జిల్లాలో అదుపులోకి వచ్చిన గ్యాస్ బ్లో అవుట్.. విద్యార్థినులు బేసిక్ ఇంగ్లీష్ మాట్లాడేలా ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి మంత్రి పొన్నం ప్రభాకర్ జోనల్, రూట్ ఆఫీసర్లు పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేయాలి ఇళ్ళస్థలాల సాధనకై 20న గ్రేటర్ జర్నలిస్టుల మహా ధర్నా తిరుపతి కపిలేశ్వరాలయంలో వైభవంగా శ్రీ కాలభైరవ హోమం తిరుపతి కపిలేశ్వరాలయంలో వైభవంగా శ్రీ కాలభైరవ హోమం అర్హులైన ప్రతి ఒక్కరికీ చేయూత పెన్షన్లు అందిస్తాం: స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్

రెవెన్యూ మరియు సర్వే సేవల ప్రగతిపై సమీక్షా సమావేశం

Select Suryaa Now
రెవెన్యూ మరియు సర్వే సేవల ప్రగతిపై సమీక్షా సమావేశం

పెండింగ్ దరఖాస్తుల త్వరితగతిన పరిష్కారానికి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు
జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్
అనకాపల్లి ప్రతినిధి ,సెప్టెంబర్ 17, మేజర్ న్యూస్: 
జిల్లాలో రెవెన్యూ శాఖకు సంబంధించిన వివిధ సర్వే పనులు, భూ రికార్డుల ప్రక్షాళన మరియు పెండింగ్ దరఖాస్తుల పరిష్కారంపై మంగళవారం ఉదయం జిల్లా కలెక్టర్ సమావేశ మందిరములో  జిల్లా కలెక్టర్  మరియు జాయింట్ కలెక్టర్ సౌర్యమని పటేల్ ఉన్నత స్థాయి అధికారులతో  సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్  మాట్లాడుతూ వివిధ మండలాల వారీగా ప్రగతి  పనులు అడిగి తెలుసుకున్నారు. ఈ సమీక్షలో పనులను నిర్దేశిత గడువులోగా  పూర్తి చేయడంలో ఆలస్యం వహిస్తున్న అధికారులను తీవ్రంగా ఖండించారు.
గ్రామాలలో చేపట్టాల్సిన రీ-సర్వే పనులు, భూ దరఖాస్తుల పరిశీలన మరియు డిజిటల్ సైన్ ప్రక్రియను ఎలాంటి జాప్యం లేకుండా వెంటనే పూర్తి చేయాలని ఆదేశిస్తూ సుదీర్ఘకాలంలో పెండింగ్‌లో ఉన్న వివిధ రెవెన్యూ దరఖాస్తులను తక్షణమే పరిష్కరించి, బాధితులకు సత్వరమే సేవలు అందించాలని స్పష్టం చేశారు.   విధుల పట్ల నిర్లక్ష్యం వహించే సంబంధిత తహశీల్దార్లు, ఎంఆర్ఓలు, విఆర్ఓలు  మరియు ఇతర రెవెన్యూ సిబ్బంది తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ, బాధ్యులపై తగిన చర్యలు ఉంటాయని ఆదేశించారు.
​ప్రజలకు మెరుగైన, పారదర్శకమైన పాలన అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ఇకపై ఎట్టి పరిస్థితుల్లోనూ జాప్యం వహిస్తే  సహించేది లేదని తెలియపరిచారు.
అన్ని మండలాల అధికారులు సమన్వయంతో పనిచేసి, ప్రజల నుండి వచ్చే విజ్ఞప్తులను నిర్ణీత వ్యవధిలో పరిష్కరించాలని ఆదేశించారు. జిల్లా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ: పెండింగ్ లో ఉన్న భూ సర్వే పనులను ​ నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని, లేకపోతే ఇబ్బందులు పడవలసి వస్తుందని.
​ఇది చాలా సీరియస్ వార్నింగ్ గా భావించి.  లాగిన్ లో ఉన్న పనులను అప్‌డేట్ చేయాలని, లేదంటే సంబంధిత అధికారులపై చర్యలు ఉంటాయని చెప్పారు.  
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తో పాటు జాయింట్ కలెక్టర్, డి ఆర్ వో వై సత్యనారాయణ రావు, మరియు తహశీల్దార్లు, ఎంఆర్ఓలు, విఆర్ఓలు  ఇతర రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
రవికుమార్ జిల్లా ఇంచార్జ్ ఎన్టిపి సూర్య