BREAKING
జేమ్స్ బాండ్ పాత్రకు రాబర్ట్ ప్యాటిన్సన్ ఎంపిక: అగ్రశ్రేణి నటుడి నుంచి అభినందనలు, అమూల్యమైన సలహా! కరీనా కపూర్, హృతిక్ రోషన్ మళ్లీ కలుస్తున్నారు: పాతికేళ్ల తర్వాత తెరపై మ్యాజిక్! శ్రీకాళహస్తి ప్రాంతంలో ఎరువులు పంపిణీ పై అవగాహన. పవన్ తో నేరుగా మాట్లాడే నేత... సొంత ఊరి లో భంగపాటు సమాచార హక్కు చట్టంపై అధికారులకు ప్రత్యేక శిక్షణ స్వీట్లపై ప్రమాదకర అల్యూమినియం రేపర్ల వినియోగం.. హైదరాబాద్‌లో నకిలీ సిల్వర్ రేపర్స్ ముఠా గుట్టురట్టు! తెలంగాణను దేశంలోనే అత్యుత్తమ స్పోర్ట్స్ హబ్‌గా మారుద్దాం మంత్రి వాకిటి శ్రీహరి రెవెన్యూ మరియు సర్వే సేవల ప్రగతిపై సమీక్షా సమావేశం సంజీపురం సర్పంచ్ అభ్యర్థిగా శ్రీలక్ష్మి ఘనంగా నామినేషన్ దాఖలు* కోనసీమ జిల్లాలో అదుపులోకి వచ్చిన గ్యాస్ బ్లో అవుట్.. విద్యార్థినులు బేసిక్ ఇంగ్లీష్ మాట్లాడేలా ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి మంత్రి పొన్నం ప్రభాకర్ జోనల్, రూట్ ఆఫీసర్లు పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేయాలి ఇళ్ళస్థలాల సాధనకై 20న గ్రేటర్ జర్నలిస్టుల మహా ధర్నా తిరుపతి కపిలేశ్వరాలయంలో వైభవంగా శ్రీ కాలభైరవ హోమం తిరుపతి కపిలేశ్వరాలయంలో వైభవంగా శ్రీ కాలభైరవ హోమం

పవన్ తో నేరుగా మాట్లాడే నేత... సొంత ఊరి లో భంగపాటు

Select Suryaa Now
పవన్ తో నేరుగా మాట్లాడే నేత... సొంత ఊరి లో భంగపాటు

రావికమతంనవంబర్ 17, మేజర్ న్యూస్:

కొత్తకోటలో కూటమికి బీటలు - సర్పంచ్ పీఠం కోసం జనసేన టీడీపీ కూడ నామినేషన్
జిల్లా రాజకీయాల్లో కూటమి పొత్తులను శాసించగల స్థాయి... పవన్ కళ్యాణ్ తో నేరుగా మాట్లాడగలిగే పలుకుబడి... అయినా సొంత గ్రామంలో చుక్కెదిరయింది.
ఆ నేతే చోడవరం నియోజకవర్గ జనసేన సమన్వయకర్త పి.వి.ఎస్.ఎన్. రాజు.అనకాపల్లి జిల్లా ఎంపీటీసీ ఎన్నికల్లో కూటమి పార్టీల సమన్వయ కమిటీ సభ్యుడిగా జిల్లా వ్యాప్తంగా పొత్తులు కుదిర్చిన ఆయన, తన స్వగ్రామం కొత్తకోట వచ్చేసరికి చేతులెత్తేశారు.
కూటమి ధర్మం ప్రకారం తన సతీమణి సునీతను జనసేన నుంచి కొత్తకోట సర్పంచ్ అభ్యర్థిగా నిలపాలని భావించారు. ఈ ప్రతిపాదనను టీడీపీ, బీజేపీ నాయకుల ముందు ఉంచారు. అయినప్పటికి ఆదివారం టీడీపీ నుంచి వెల్లంకి రాజేశ్వరి నామినేషన్ దాఖలు చేశారు. ఆమె వెనుక ఇటీవల గెలిచిన ఎంపీటీసీలు, జడ్పీటీసీ కోట నీలవేణి మద్దతు తెలిపారు. మంగళవారం జనసేన మద్దతుదారులతో మాత్రమే పి.వి.ఎస్.ఎన్. రాజు సతీమణి సునీత నామినేషన్ వేశారు.జిల్లాలో పొత్తులు కుదిర్చిన నేత సొంతూర్లోనే పొత్తు కుదర్చలేకపోవడం  హాట్ టాపిక్ గా మారింది.