BREAKING
జేమ్స్ బాండ్ పాత్రకు రాబర్ట్ ప్యాటిన్సన్ ఎంపిక: అగ్రశ్రేణి నటుడి నుంచి అభినందనలు, అమూల్యమైన సలహా! కరీనా కపూర్, హృతిక్ రోషన్ మళ్లీ కలుస్తున్నారు: పాతికేళ్ల తర్వాత తెరపై మ్యాజిక్! శ్రీకాళహస్తి ప్రాంతంలో ఎరువులు పంపిణీ పై అవగాహన. పవన్ తో నేరుగా మాట్లాడే నేత... సొంత ఊరి లో భంగపాటు సమాచార హక్కు చట్టంపై అధికారులకు ప్రత్యేక శిక్షణ స్వీట్లపై ప్రమాదకర అల్యూమినియం రేపర్ల వినియోగం.. హైదరాబాద్‌లో నకిలీ సిల్వర్ రేపర్స్ ముఠా గుట్టురట్టు! తెలంగాణను దేశంలోనే అత్యుత్తమ స్పోర్ట్స్ హబ్‌గా మారుద్దాం మంత్రి వాకిటి శ్రీహరి రెవెన్యూ మరియు సర్వే సేవల ప్రగతిపై సమీక్షా సమావేశం సంజీపురం సర్పంచ్ అభ్యర్థిగా శ్రీలక్ష్మి ఘనంగా నామినేషన్ దాఖలు* కోనసీమ జిల్లాలో అదుపులోకి వచ్చిన గ్యాస్ బ్లో అవుట్.. విద్యార్థినులు బేసిక్ ఇంగ్లీష్ మాట్లాడేలా ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి మంత్రి పొన్నం ప్రభాకర్ జోనల్, రూట్ ఆఫీసర్లు పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేయాలి ఇళ్ళస్థలాల సాధనకై 20న గ్రేటర్ జర్నలిస్టుల మహా ధర్నా తిరుపతి కపిలేశ్వరాలయంలో వైభవంగా శ్రీ కాలభైరవ హోమం తిరుపతి కపిలేశ్వరాలయంలో వైభవంగా శ్రీ కాలభైరవ హోమం

సమాచార హక్కు చట్టంపై అధికారులకు ప్రత్యేక శిక్షణ

Select Suryaa Now
సమాచార హక్కు చట్టంపై అధికారులకు ప్రత్యేక శిక్షణ

మెదక్ ప్రతినిధి : ప్రభుత్వ పరిపాలనలో పారదర్శకత, జవాబుదారీతనాన్ని మరింత పెంపొందించడంతో పాటు ప్రజలకు ప్రభుత్వ సమాచారాన్ని సకాలంలో అందించడమే లక్ష్యంగా సమాచార హక్కు చట్టం (RTI Act–2005)పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు అదనపు కలెక్టర్ నగేష్ తెలిపారు.

మంగళవారం మెదక్ జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఎం.సి.ఆర్.హెచ్.ఆర్.డి. (MCRHRD) ఇన్‌స్టిట్యూట్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి పౌర సమాచార అధికారులు, సహాయ పౌర సమాచార అధికారులకు రెండు రోజుల ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి అదనపు కలెక్టర్ నగేష్ ముఖ్య అతిథిగా హాజరై మొదటిరోజు శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. సమాచార హక్కు చట్టం సామాన్య పౌరులకు ప్రభుత్వం కల్పించిన శక్తివంతమైన హక్కు అని పేర్కొన్నారు. ప్రభుత్వ శాఖల్లో పారదర్శకతను పెంచడంతో పాటు అధికారులు తమ విధుల పట్ల జవాబుదారీగా వ్యవహరించేందుకు ఈ చట్టం ఎంతగానో దోహదపడుతుందని తెలిపారు.

సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తుదారులు కోరిన సమాచారాన్ని చట్ట నిబంధనలకు అనుగుణంగా నిర్ణీత గడువులోగా అందజేయాలని అధికారులకు సూచించారు. సాధారణ సమాచారాన్ని 30 రోజుల్లోగా, ఒక వ్యక్తి ప్రాణం లేదా స్వేచ్ఛకు సంబంధించిన సమాచారాన్ని 48 గంటల్లోగా అందించాలని స్పష్టం చేశారు. సమాచారాన్ని అందించే విషయంలో అధికారులు నిర్లక్ష్యం వహించకుండా, ఖచ్చితత్వంతో వ్యవహరించాలని సూచించారు. చట్టంలోని నిబంధనలకు లోబడి పారదర్శకంగా సమాచారాన్ని అందించాలని పేర్కొన్నారు.

ఈ రెండు రోజుల శిక్షణ కార్యక్రమంలో సమాచార హక్కు చట్టంలోని వివిధ అంశాలు, అధికారుల బాధ్యతలు, దరఖాస్తుల పరిష్కార విధానాలపై అవగాహన కల్పించనున్నారు. ఈ కార్యక్రమంలో ఎం.సి.ఆర్.హెచ్.ఆర్.డి.కి చెందిన శంకర్, వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన పౌర సమాచార అధికారులు, సహాయ పౌర సమాచార అధికారులు, ఇతర సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.