మండపేట లో వన సమారాధన మహోత్సవం
నెేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరం ఆర్యవైశ్య యూత్, మండపేట ఆధ్వర్యంలో 19వ కార్తీకమాస వన సమారాధన మహోత్సవం మండపేట సూర్య కన్వర్షన్ హాల్ లో మంగళవారం నిర్వహించారు. శ్రీ సూర్య కన్వెన్షన్ (ఫంక్షన్ హాల్), బస్ స్టాండ్ వద్ద ఈ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పుర పాలక సంఘం చైర్మన్ వేగుళ్ళ అజయ్ కుమార్ విచ్చేశారు. తొలుత పూజా కార్యక్రమాలు నిర్వహించారు.ఈ వైశ్య యూత్ సభ్యులు కుటుంబ సమేతంగా పాల్గొని మహోత్సవాన్ని విజయవంతం చేశారు. వన సమారాధనలో భాగంగా విందు కార్యక్రమాన్ని నిర్వహించారు. నిర్వాహక కమిటీ అధ్యక్షులు కేశవరపు శ్రీనివాసరావు కార్యదర్శి పెరుమాళ్ళ రాంబాబు
కోశాధికారి బోడా ప్రసన్న కుమార్ సహాయ కార్యదర్శి కేదారిశెట్టి లక్ష్మణరావు ఉపాధ్యక్షులు కంచర్ల కార్తీక్, కంచర్ల మురళీ, ఇంకూలు శ్రీనివాస్ లు ఆధ్వర్యంలో చైర్మెన్ వేగుళ్ళ అజయ్ కుమార్ ను సత్కరించారు. ఈ సందర్భంగా అజయ్ కుమార్ మాట్లాడుతూ ఆర్యవైశ్యులు క్రమశిక్షణ కు మారుపేరని పేర్కొన్నారు. తన సహాయ సహకారం ఎల్లపుడూ అందిస్తానని పేర్కొన్నారు.అనంతరం ప్రతి ఏటా ఇచ్చే విద్యార్థులు స్కాలర్ షిప్ లు పంపిణీ చేశారు. వినోద కార్యక్రమాలు నిర్వహించారు.
ది వైశ్య యూత్ స్టీరింగ్ కమిటీ :
వాకచర్ల వి.వి. సత్యనారాయణ (గుప్తు),కంచర్ల వి.వి. ప్రసాద్, మన్యం మహేష్, సంకా సూర్యనారాయణ (బాజ్జి)
నాళం కె.ఎస్.కె సుబ్రహ్మణ్యం (కిట్టు),చక్కా రాంబాబు, బోనగిరి సుబ్బారావు నూలు వి.వి. సూర్యనారాయణమూర్తి తదితరులు ఏర్పాట్లు చేశారు. దివంగత కంచర్ల మాణిక్యాలరావు (జిల్లా) వ్యవస్థాపకులుగా ఈ సంస్థ కార్యక్రమాలను నిర్వహిస్తోందనీ వారు పేర్కొన్నారు.కార్తీక మాసం సందర్భంగా ప్రతి ఏటా జరిగే ఈ వన సమారాధనకు ఆర్యవైశ్య కుటుంబాల నుంచి విశేష స్పందన లభిస్తోందన్నారు. ఈ కార్యక్రమం లో ది వైశ్య యూత్ అధ్యక్షులు కేశవరపు శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులు కంచర్ల కార్తీక్ ఉపాధ్యక్షులు, కంచర్ల మురళి, ఉపాధ్యక్షులు ఇంకోలు శ్రీనివాసు, సెక్రటరీ పెరుమాళ్ళ రాంబాబు, ట్రెజరర్ బోడ ప్రసన్నకుమార్, కేదారీశెట్టి లక్ష్మణరావు, శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ వాకచర్ల గుప్త, నాళం కిట్టు , కంచర్ల ప్రసాద్,వాకచర్ల భద్ర రావు, బోనగిరి సత్తిబాబు బోనగిరి సుబ్బారావు, సంకా బాబ్జీ, నూలు మూర్తి అధిక సంఖ్యలో వైశ్య ప్రముఖులు పాల్గొన్నారు.