BREAKING
భక్తులకు పండ్లు, వాటర్ బాటిల్ లు అందజేసిన హెచ్.పీ గ్యాస్ డీలర్ ఖుర్షీద్ హుస్సేన్ రాష్ట్ర స్థాయి పోటీలకు రామవరం విద్యార్థి ఓటీటీలో సందడి చేసేందుకు వస్తున్న ‘కాల్ మీ బే’ సీజన్ 2.. కీలక పాత్రలో శృతి హాసన్ ఎంట్రీ! ఫోక్స్ చట్టంపై విద్యార్థులకు అవగాహన కలిగి ఉండాలి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో సీఎం చంద్రబాబు భేటీ మెట్‌పల్లిలో టెన్షన్.. టెన్షన్..! ..ఎమ్మెల్యే ఇంటి ముట్టడికి కాంగ్రెస్ పిలుపు.. టిడిపిలో చేరికలు రమేష్ వర్మ ‘కొక్కొరొకో’ సినిమా నుంచి ‘సీతాకోకమ్మ’ ఫస్ట్ సింగిల్ విడుదల.. ఆకట్టుకుంటున్న మ్యూజికల్ మెలోడీ! వైభవంగా తిరుప్పాడ సేవ ధాన్యం కొనుగోలు చేయాలని రైతుల భారీ ధర్నా చీన్ టపాక్ డుండుం సినిమా నుంచి మరొక్కసారి మెలోడీ సాంగ్ విడుదల.. శ్రోతలను ఆకట్టుకుంటున్న లవ్ సాంగ్! పెరుగుతున్న బియ్యం ధరలను నియంత్రించాలి-సిపిఐపట్టణ కార్యదర్శి కె ప్రసాద్ నేనేమీ సెహ్వాగ్ 2.0 వెర్షన్ కాదు.. నాన్నతో పోలికలపై ఆర్యవీర్ సెహ్వాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు! తప్పుడు కేసు బనాయించారంటూ.. భద్రాచలంలో పురుగుల మందు తాగిన వ్యక్తి... విద్యార్థులకు కంటి పరీక్షలు.. 19 మందికి అద్దాల కోసం సిఫార్సు

ఫోక్స్ చట్టంపై విద్యార్థులకు అవగాహన కలిగి ఉండాలి

Select Suryaa Now
ఫోక్స్ చట్టంపై విద్యార్థులకు అవగాహన కలిగి ఉండాలి

నెేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరం 

 బాలలపై జరిగే లైంగిక వేధింపులను అరికట్టడంతో పాటు, చిన్నారులకు చట్టపరమైన రక్షణ కల్పించేందుకు రూపొందించిన పోక్సో చట్టంపై ప్రతి ఒక్కరికీ అవగాహన అవసరమని అనపర్తి జూనియర్ సివిల్ కోర్టు న్యాయమూర్తి ఎం. వంశీకృష్ణ అన్నారు. న్యాయ అవగాహన సదస్సుల్లో భాగంగా అనపర్తిలోని టీఏఆర్ పాఠశాలలో పోక్సో చట్టంపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా న్యాయమూర్తి ఎం. వంశీకృష్ణ మాట్లాడుతూ 18 సంవత్సరాల లోపు బాలబాలికలను లైంగిక వేధింపులు, దాడులు, దోపిడీల నుంచి రక్షించేందుకు పోక్సో చట్టం అమలులో ఉందని వివరించారు. బాలలపై జరిగే లైంగిక నేరాలకు సంబంధించి ఈ చట్టంలోని నిబంధనలు, నేరాలకు విధించే శిక్షలు, బాధిత బాలలకు కల్పించే రక్షణ తదితర అంశాలను విద్యార్థులకు వివరించారు. బాలల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం, అనుచితంగా తాకడం, బెదిరించడం వంటి చర్యలు నేరాల పరిధిలోకి వస్తాయని తెలిపారు. విద్యార్థులు తమపై ఎవరైనా అనుచితంగా ప్రవర్తించినా, వేధింపులకు గురిచేసినా భయపడకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు లేదా సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. చిన్నారులకు తమ హక్కులపై అవగాహన కల్పించడంతో పాటు, వారికి సురక్షితమైన వాతావరణాన్ని కల్పించాల్సిన బాధ్యత తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సమాజంపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కే. శ్రీనివాసరెడ్డి, కార్యదర్శి టీ.వీ.వీ. రమణమూర్తి, న్యాయవాదులు నల్లమిల్లి వినూరెడ్డి, శ్యామ్ ప్రసాద్ రెడ్డి, పాఠశాల కరస్పాండెంట్ టీ. అప్పారెడ్డి తదితరులు పాల్గొన్నారు.