BREAKING
రాజన్న ఆలయ గోపురాన్ని ముట్టుకుంటే సహించం: భాజపా శబరిమలలో భక్తులకు అత్యాధునిక సౌకర్యాలు.. ప్లాన్ ప్రకారం నిర్మాణాలు చేపట్టాలి భక్తులకు పండ్లు, వాటర్ బాటిల్ లు అందజేసిన హెచ్.పీ గ్యాస్ డీలర్ ఖుర్షీద్ హుస్సేన్ రాష్ట్ర స్థాయి పోటీలకు రామవరం విద్యార్థి ఓటీటీలో సందడి చేసేందుకు వస్తున్న ‘కాల్ మీ బే’ సీజన్ 2.. కీలక పాత్రలో శృతి హాసన్ ఎంట్రీ! ఫోక్స్ చట్టంపై విద్యార్థులకు అవగాహన కలిగి ఉండాలి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో సీఎం చంద్రబాబు భేటీ మెట్‌పల్లిలో టెన్షన్.. టెన్షన్..! ..ఎమ్మెల్యే ఇంటి ముట్టడికి కాంగ్రెస్ పిలుపు.. టిడిపిలో చేరికలు రమేష్ వర్మ ‘కొక్కొరొకో’ సినిమా నుంచి ‘సీతాకోకమ్మ’ ఫస్ట్ సింగిల్ విడుదల.. ఆకట్టుకుంటున్న మ్యూజికల్ మెలోడీ! వైభవంగా తిరుప్పాడ సేవ ధాన్యం కొనుగోలు చేయాలని రైతుల భారీ ధర్నా చీన్ టపాక్ డుండుం సినిమా నుంచి మరొక్కసారి మెలోడీ సాంగ్ విడుదల.. శ్రోతలను ఆకట్టుకుంటున్న లవ్ సాంగ్! పెరుగుతున్న బియ్యం ధరలను నియంత్రించాలి-సిపిఐపట్టణ కార్యదర్శి కె ప్రసాద్

రాష్ట్ర స్థాయి పోటీలకు రామవరం విద్యార్థి

Select Suryaa Now
రాష్ట్ర స్థాయి పోటీలకు రామవరం విద్యార్థి

నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరం క్రీడల్లో తొలి అడుగులోనే రామవరం విద్యార్థి పలివెల హరిచంద్ర మనోహర్ ప్రతిభ చాటాడు. అనపర్తి మండలం రామవరం మూలారెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న మనోహర్, రాజమహేంద్రవరం ఆర్ట్స్ కళాశాల మైదానంలో నిర్వహించిన స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ పోటీల్లో అండర్-14 డిస్కస్ త్రో విభాగంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా స్థాయిలో ద్వితీయ స్థానం సాధించాడు. దీంతో రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. గతంలో ఎటువంటి క్రీడా పోటీల్లో పాల్గొనని మనోహర్‌లోని ఆసక్తి, ప్రతిభను గుర్తించిన పాఠశాల పీడీ ఆర్. ప్రియాంక ప్రత్యేక శిక్షణ ఇచ్చి పోటీలకు సిద్ధం చేశారు. ద్వితీయ స్థానం సాధించిన మనోహర్‌ను, పీడీ ప్రియాంకను ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి శాలువాతో సత్కరించి అభినందించారు. ఎంపీడీవో మండ రామకృష్ణారెడ్డి, పాఠశాల అభివృద్ధి కమిటీ చైర్మన్ ఎస్. హరికృష్ణారెడ్డి, హెచ్‌ఎం శ్రీనివాసరావు, ఉపాధ్యాయులు విద్యార్థిని అభినందించారు.