వైభవంగా తిరుప్పాడ సేవ
నెేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరం కార్తీకమాస పవిత్రోత్సవాల్లో భాగంగా మండపేటలో కొలువై ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో మూడవ రోజు తిరుప్పాడ సేవను భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు.ఈ సందర్భంగా 108 కిలోల పులిహోరతో అన్నకూటోత్సవం నిర్వహించి స్వామివారికి ప్రత్యేక నైవేద్యం సమర్పించారు. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి సన్నిధిలో పులిహోరను పెద్ద రాశిగా పోసి, దానిపై స్వామివారి ఆకృతిలో తిరునామం అలంకరించి, చుట్టూ తులసి మాలలు, గులాబీ పూలతో అందంగా అలంకరించారు. చుండ్రు పట్టాభిరామయ్య, శిరీష కుటుంబ సభ్యుల సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఈ మహాప్రసాదాన్ని అనంతరం భక్తులకు పంపిణీ చేశారు.ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీనివాసరావు, ఆలయ చైర్మన్ వాకచర్ల గుప్తా పర్యవేక్షణలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు, 28 వ వార్డు కౌన్సిలర్ కోన ఉషాకుమారి, బి. రాజేశ్వరి, దోర భాగ్యలక్ష్మి, కె. విద్యాసాగర్, నాగేశ్వరరావు, కోడూరి త్రిమూర్తులు తదితరులు పాల్గొన్నారు.భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.