మెట్‌పల్లిలో టెన్షన్.. టెన్షన్..! ..ఎమ్మెల్యే ఇంటి ముట్టడికి కాంగ్రెస్ పిలుపు..
సూర్య మెట్‌పల్లి:జగిత్యాల జిల్లా మెట్‌పల్లి పట్టణంలో రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా ఉద్రిక్తతకు దారితీశాయి. మున్సిపల్ కార్మికులను ఎమ్మెల్యే వ్యక్తిగత పనుల కోసం వాడుకుంటున్నాడంటూ ఎమ్మెల్యే ఇంటి ముట్టడికి కాంగ్రెస్ పార్టీ నాయకులు పిలుపునివ్వడంతో పట్టణంలో రాజకీయ వేడి రాజుకుంది. కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే నివాసం వైపు వెళ్లేందుకు ప్రయత్నించగా, బీఆర్ఎస్ నాయకులు వారిని అడ్డుకున్నారు.ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారడంతో కాంగ్రెస్ నాయకులపై దాడి జరిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో అక్కడ తీవ్ర గందరగోళం నెలకొంది.ఒక్కసారిగా చోటుచేసుకున్న ఈ పరిణామాలతో మెట్‌పల్లి పట్టణంలో టెన్షన్ వాతావరణం ఏర్పడింది. పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు పోలీసులు రంగంలోకి దిగి ఇరువర్గాలను చెదరగొట్టారు.ఎమ్మెల్యే ఇంటి ముట్టడి పిలుపు.. బీఆర్ఎస్ నాయకుల అడ్డగింత.. కాంగ్రెస్ నాయకులపై దాడి ఆరోపణలతో మెట్‌పల్లిలో రాజకీయ వాతావరణం వేడెక్కింది.