పాత పెన్షన్ విధానాన్ని వెంటనే అమలు చెయ్యాలి
సూర్య ఆదిలాబాద్ ప్రతినిధి: కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (CPS)ను రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని (OPS) పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర సీపీఎస్ ఎంప్లాయీస్ యూనియన్ (TSCPSEU) ఆదిలాబాద్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో నేడు కలెక్టరేట్ వద్ద ధర్మదీక్ష నిర్వహించినట్లు యూనియన్ జిల్లా అధ్యక్షులు కాంబ్లే విజయ్ కుమార్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మానిఫెస్ట్ లో పేర్కొనట్లు వెంటనే CPS ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చెయ్యాలని కాంబ్లే విజయ్ కుమార్ తెలిపారు.రాష్ట్రవ్యాప్త సామూహిక సాధారణ సెలవు కార్యక్రమంలో భాగంగా ఈ ధర్మదీక్ష చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ సంఘాలతో వెంటనే చర్చలు జరిపి, పాత పెన్షన్ విధానం పునరుద్ధరణపై స్పష్టమైన నిర్ణయం ప్రకటించాలని డిమాండ్ చేశారు. జిల్లాలోని ఉద్యోగులు, ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి శాంతియుతంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని తెలియజేశారు.. ఈ కార్యక్రమంలో TSCPSEU రాష్ట్ర నాయకులు సెర్పూర్ సత్యనారాయణ, చవాన్ నరేశ్, చిలుక పోచన్న, దీపక్, శారద, శ్రీలత, విజయ్ శేఖర్, సందీప్, రమేష్ నరేశ్ తదితరులు పాల్గొన్నారు..