నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం కరివేన గ్రామం డిపాల్ పాఠశాల విద్యార్థులు రాష్ట్రస్థాయి టెన్నిస్ బాల్ క్రికెట్ కు ఎంపిక
టెన్నిస్ బాల్ క్రికెట్ రాష్ట్రస్థాయికి ఎంపికైన డిపాల్ విద్యార్థులు
- విద్యార్థులను అభినందించిన డి పాల్ పాఠశాల ప్రిన్సిపాల్ ఫాదర్ సీన్స్ జాకోబ్
ఆత్మకూరు, మేజర్ న్యూస్ : టెన్నిస్ బాల్ క్రికెట్లో డి పాల్ పాఠశాలకు చెందిన విద్యార్థులు రాష్ట్ర స్థాయికి ఎంపికైనట్లు ప్రిన్సిపల్ ఫాదర్ సీన్స్ జాకోబ్, ఫాదర్ శాంటోలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అండర్ 19 విభాగంలో డి పాల్ పాఠశాలకు చెందిన విద్యార్థులు టెన్నిస్ బాల్ క్రికెట్లో రాష్ట్రస్థాయికి ఎంపిక కావడం హర్షనీయమన్నారు. విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణిస్తే భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవచ్చు అన్నారు. క్రీడలు స్నేహభావాన్ని పెంచుతూ మేధాశక్తిని పెంపొందిస్తాయని ప్రతి విద్యార్థి క్రీడలపై మొగ్గుచూపాలన్నారు. రాష్ట్ర స్థాయికి ఎంపికైన విద్యార్థులు కృషి పట్టుదలతో అత్యంత ప్రతిభ కనబరిచి జాతీయస్థాయికి ఎదగాలని విద్యార్థులను అభినందించారు. రాష్ట్ర స్థాయికి డిపాల్ పాఠశాల విద్యార్థులు ఎంపిక అయ్యేందుకు కృషిచేసిన వ్యాయామ ఉపాధ్యాయులను అభినందించారు.