నరసరావుపేట మున్సిపల్ చైర్మన్ కూటమి అభ్యర్థి రూపేష్ గుప్తాకు టీడీపీ బీఫామ్ అందజేత
నరసరావుపేట: నరసరావుపేట మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి కూటమి చైర్మన్ అభ్యర్థి నాగసరపు రూపేష్ గుప్తాకు మంగళవారం తెలుగుదేశం పార్టీ బీఫామ్ అందజేశారు. నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద బాబు, టీడీపీ పల్నాడు జిల్లా అధ్యక్షులు షేక్ జాన్ సైదా, ఎన్నికల పరిశీలకులు కొనకళ్ల నారాయణ, జనసేన పార్లమెంట్ పరిశీలకులు సయ్యద్ జిలాని, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కొల్లి బ్రహ్మయ్య తదితరులు రూపేష్ గుప్తాకు పార్టీ బీఫామ్ అందజేశారు.ఈ సందర్భంగా కూటమి నాయకులు నరసరావుపేట మున్సిపాలిటీలో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా సమష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో ఎన్నికల ప్రచారంలో పాల్గొని కూటమి విజయానికి కృషి చేయాలని సూచించారు. కూటమి అభ్యర్థికి పార్టీ బీఫామ్ అందజేయడంతో నరసరావుపేట మున్సిపల్ ఎన్నికల రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారాయి.
మల్లికార్జునరావు పల్నాడు జిల్లా ఇన్చార్జి…