BREAKING
చరిత్ర సృష్టించిన తమిళ సంగీతం.. గ్రామీ నామినేషన్ దక్కించుకున్న దేవన్ ఏకాంబరం ‘వర్చువాయ్’ పాట! గుమ్మగట్ట కేజీబీవీలో ఫుడ్ పాయిజన్ కలకలం - 45 మంది బాలికలు అస్వస్థత, 6 మంది పరిస్థితి తీవ్రం! సీనియర్ నాయకుడు ఉమేష్ వైఎస్ఆర్ సీపీలో చేరిక. గ్యాస్ లీకేజీపై ఆందోళన వద్దు.... మనవరాలు ఆరాధ్య బచ్చన్ పుట్టినరోజు వేడుక.. అమితాబ్ బచ్చన్ ఎమోషనల్ బర్త్‌డే విషెస్! పారా క్రీడల్లో మెరిసిన ఎస్‌వీఆర్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థి భరత్ కుమార్- కళాశాల చైర్మెన్ వెంకట రామిరెడ్డి మైనర్‌ను అపహరించి హైదరాబాద్‌కు తరలింపు.. ఆటో డ్రైవర్ అరెస్ట్ సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్, వేధింపులు నిజం.. సీనియర్ నటి రమ్యకృష్ణ సంచలన వ్యాఖ్యలు! బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. 800 కోట్ల మైలురాయికి అత్యంత చేరువలో రణబీర్, యశ్ చిత్రం! కొత్త జేమ్స్ బాండ్ రాబర్ట్ ప్యాటిన్సన్ సరసన బాండ్ గర్ల్ ఎవరు?.. రేసులో ముందంజలో ఉన్న హాలీవుడ్ భామలు వీరే! బాక్సాఫీస్ వద్ద సూర్య ‘సీన్’ జోరు.. 11 రోజుల్లో 140 కోట్ల మార్క్ చేరువలోకి చేరిన కలెక్షన్లు! గుమ్మగట్ట కేజీబీవి లో కలకలం...25 మందికి అస్వస్థత.. అప్పుల బాధతో టైలర్ ఆత్మహత్య పృథ్విరెడ్డికి మంత్రి సత్యకుమార్ ఆశీర్వాదం తైక్వాండో లో విక్టరీ విద్యార్థుల ప్రతిభ

మైనర్‌ను అపహరించి హైదరాబాద్‌కు తరలింపు.. ఆటో డ్రైవర్ అరెస్ట్

Select Suryaa Now
మైనర్‌ను అపహరించి హైదరాబాద్‌కు తరలింపు.. ఆటో డ్రైవర్ అరెస్ట్

కుటుంబంతో పరిచయం పెంచుకుని నమ్మకంగా వ్యవహరిస్తూ, చివరకు మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడటమే కాకుండా ఆమెను అపహరించిన ఆటో డ్రైవర్‌ను పట్టాభిపురం పోలీసులు అరెస్ట్ చేశారు. బాలికను చంపుతానని బెదిరించి, గుంటూరు నుంచి హైదరాబాద్‌కు తీసుకెళ్లిన నిందితుడిని ప్రత్యేక బృందం చాకచక్యంగా పట్టుకుంది.గుంటూరులోని వెంగళరావునగర్‌కు చెందిన ఓ మహిళ తన ఇద్దరు కుమార్తెలను ప్రతిరోజూ కళాశాలకు తీసుకెళ్లేందుకు, తిరిగి ఇంటికి తీసుకువచ్చేందుకు కోడూరు సుబ్బారావు అలియాస్ పండు (39)ను ఆటో డ్రైవర్‌గా నియమించుకుంది. ఈ క్రమంలో కుటుంబంతో పరిచయం పెంచుకున్న సుబ్బారావు, మైనర్ బాలికపై చెడు ఉద్దేశంతో వ్యవహరించినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.ఈ ఏడాది ఆగస్టు మొదటి వారంలో బాలిక ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో అసభ్యంగా ప్రవర్తించేందుకు ప్రయత్నించగా, ఆమె తప్పించుకుని బయటకు వెళ్లిపోయింది. అనంతరం సెప్టెంబర్ మూడో వారంలో బాలిక ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో నిందితుడు బలవంతంగా బెడ్‌రూమ్‌లోకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే బాలికతో పాటు ఆమె చెల్లెలిని కూడా చంపుతానని బెదిరించినట్లు పోలీసులు తెలిపారు. 
హైదరాబాద్‌కు తీసుకెళ్లి.. తన కుమార్తెగా పరిచయం....!
నవంబర్ 11న కళాశాల నుంచి బయటకు వచ్చిన బాలికను ఆమె తల్లిదండ్రుల ఇంటికి తీసుకెళ్తానని నమ్మించిన నిందితుడు గుంటూరు బస్టాండ్‌కు తీసుకెళ్లాడు. అక్కడి నుంచి విజయవాడ మీదుగా హైదరాబాద్‌కు తరలించి, తన స్నేహితుడైన చంద్రశేఖర్ ఇంట్లో మూడు రోజులపాటు ఉంచాడు. అక్కడ బాలికను తన కుమార్తెగా పరిచయం చేసినట్లు పోలీసుల మీడియా బ్రీఫ్‌లో పేర్కొన్నారు. ప్రత్యేక బృందంతో గాలింపు.. విజయవాడలో పట్టివేత బాలిక కనిపించకపోవడంతో ఆందోళనకు గురైన తల్లి పట్టాభిపురం పోలీసులను ఆశ్రయించింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గుంటూరు వెస్ట్ డివిజన్ డీఎస్పీ బెల్లం శ్రీనివాసరావు పర్యవేక్షణలో పట్టాభిపురం సీఐ గంగా వెంకటేశ్వర్లు, మహిళా ఎస్ఐ పి. తరంగణి, సిబ్బంది ప్రత్యేక బృందంగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు.నిందితుడు బాలికతో కలిసి హైదరాబాద్ నుంచి విజయవాడకు తిరిగి వస్తున్నట్లు గుర్తించిన పోలీసులు విజయవాడ బస్టాండ్‌లో ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి వద్ద నుంచి వివో స్మార్ట్‌ఫోన్, లావా కీప్యాడ్ ఫోన్‌తో పాటు నేర సమయంలో ధరించినట్లు తెలిపిన దుస్తులను స్వాధీనం చేసుకున్నారు.  పోక్సో చట్టం కింద కేసు నమోదు నిందితుడు కోడూరు సుబ్బారావు అలియాస్ పండును నవంబర్ 16న సాయంత్రం 5 గంటలకు అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. నవంబర్ 17న కోర్టులో హాజరుపరిచేందుకు ఎస్కార్ట్ ద్వారా పంపించారు. ఈ ఘటనపై క్రైమ్ నంబర్ 573/2026 కింద బీఎన్‌ఎస్ సెక్షన్లు 64(1), 137(2), 351(2), పోక్సో చట్టంలోని సెక్షన్ 4(1) ప్రకారం కేసు నమోదు చేశారు.పట్టాభిపురం పోలీసుల హెచ్చరిక: పిల్లల భద్రత విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని, తెలిసిన వ్యక్తులైనా వారి ప్రవర్తనపై నిఘా ఉంచాలని పోలీసులు సూచించారు. పిల్లలకు ఏవైనా ఇబ్బందులు ఎదురైతే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు.

 

క  నాగరాజు క్రైమ్