BREAKING
సల్మాన్ ఖాన్ 'మాన్‌స్టర్' 10 రోజుల భారీ యాక్షన్ షెడ్యూల్ షురూ వైద్య రంగంలో విప్లవం ముంబై ప్రయాణికులకు శుభవార్త: రూ. 12,710 కోట్ల పన్వేల్–వసాయ్ రైల్ కారిడార్‌కు రైల్వే బోర్డు గ్రీన్ సిగ్నల్! ఐఎంఏ వివాదం: సన్నీ డియోల్ 'సూర్య: అంత్ సే ఆరంభ్ తక్' విడుదల 2027కి వాయిదా? ఎగ్జిబిషన్ బకాయిల వసూళ్లపై మున్సిపల్ కమిషనర్‌ను నిలదీసిన ఉక్కు ప్రవీణ్! భారత విమానయాన రంగంలో భారీ విస్తరణ... జెన్-జీ బోల్డ్ బిజినెస్ వ్యూహాలు, సోషల్ మీడియా వాస్తవాలు వెల్లడించిన ఖుషి కపూర్ మనవరాలు ఆరాధ్య బచ్చన్ 15వ పుట్టినరోజు: అమితాబ్ బచ్చన్ హృదయపూర్వక ఆశీస్సులు దేశీయ స్టాక్ మార్కెట్ల తాజా అప్‌డేట్: 400 పాయింట్ల లాభంలో సెన్సెక్స్, 11% జంప్ చేసిన ఫస్ట్‌క్రై కాల్పుల ఘటన తర్వాత సోషల్ మీడియాలోకి రీఎంట్రీ ఇచ్చిన టైగర్ ష్రాఫ్: కాల్పుల ఘటన తర్వాత షూటింగ్‌కు తిరిగొచ్చిన టైగర్ ష్రాఫ్.. సిబ్బందికి కీలక ఆదేశాలు! నెపోటిజం చర్చలపై స్పందించిన అనన్య పాండే పి అండ్ టీ కాలనీలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయం శివనామస్మరణ భక్తి శ్రద్ధలతో అయ్యప్ప పడిపూజ -శ్రీ ధర్మ శాస్తా భక్త సేవా సమితి ఆధ్వర్యంలో సాములకు అన్నప్రసాద వితరణ బ్యాంకింగ్ స్టాక్స్‌లో బుల్ జోరు: చారిత్రక గరిష్ఠం 62,000 దాటిన నిఫ్టీ బ్యాంక్!

ఎగ్జిబిషన్ బకాయిల వసూళ్లపై మున్సిపల్ కమిషనర్‌ను నిలదీసిన ఉక్కు ప్రవీణ్!

Select Suryaa Now
ఎగ్జిబిషన్ బకాయిల వసూళ్లపై మున్సిపల్ కమిషనర్‌ను నిలదీసిన ఉక్కు ప్రవీణ్!

అఫిడవిట్లు, టెండర్ల కేటాయింపుపై ప్రశ్నలు.. ఏసీబీ, ఐటీ శాఖలకు ఫిర్యాదు చేస్తామని వెల్లడి

ప్రొద్దుటూరు అర్బన్ మేజర్ న్యూస్:

కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలో ఎగ్జిబిషన్ నిర్వహణకు సంబంధించిన వివాదం మరింత రాజకీయ వేడిని రగిలిస్తోంది. ఈ వ్యవహారంలో మున్సిపల్ కమిషనర్ వ్యవహారశైలిపై టీడీపీ మాజీ ఇన్‌చార్జి జి.వి. ప్రవీణ్ కుమార్ రెడ్డి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. మంగళవారం స్థానిక వైఎంఆర్ కాలనీలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎగ్జిబిషన్ నిర్వాహకుల నుంచి మున్సిపాలిటీకి రావాల్సిన బకాయిల వసూళ్లలో జాప్యం జరుగుతోందని ఆరోపించారు. మున్సిపాలిటీకి రావాల్సిన ఆదాయాన్ని గెజిట్ నిబంధనల ప్రకారం వసూలు చేయకుండా, ఎగ్జిబిషన్ నిర్వాహకులకు గడువు ఇవ్వడంలో అధికారులు అనుసరిస్తున్న విధానంపై ఆయన ప్రశ్నలు సంధించారు. రూ.100 బాండ్ పేపర్‌పై అఫిడవిట్లు తీసుకోవడం వెనుక ఉన్న చట్టబద్ధత ఏమిటని ప్రశ్నించారు. గతంలో వాయిదాల పద్ధతిలో చెల్లింపులకు అవకాశం లేదని చెప్పిన అధికారులు, ప్రస్తుతం గడువు ఎలా కల్పిస్తున్నారని నిలదీశారు. ఈ పరిణామాలపై ప్రజలకు స్పష్టమైన వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే ఎగ్జిబిషన్ సామగ్రి విలువ సుమారు రూ.90 లక్షలు మాత్రమే ఉంటే, దానిని రూ.3 కోట్లుగా చూపించాలని కమిషనర్ లేఖ రాయడం వెనుక ఉద్దేశమేమిటని ప్రశ్నించారు. పాన్ కార్డు లేని వ్యక్తికి టెండర్ ఎలా కేటాయించారనే అంశంపైనా అధికారులు సమాధానం చెప్పాలని కోరారు. ఈ వ్యవహారంలో ఏమైనా అక్రమాలు జరిగాయా అనే అనుమానాలు వ్యక్తం చేస్తూ, అవసరమైన ఆధారాలతో ఏసీబీ, ఆదాయపు పన్ను శాఖ అధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు వెల్లడించారు. ఇదే సందర్భంగా మాజీ ఎమ్మెల్యే రాచమల్లు కుటుంబంతో మున్సిపల్ కమిషనర్‌కు ఏమైనా సంబంధాలు లేదా అవగాహనలు ఉన్నాయా అంటూ ప్రవీణ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. గతంలో ఇదే ఎగ్జిబిషన్ అంశంపై ఆందోళనలు చేసిన మాజీ ఎమ్మెల్యే ప్రస్తుతం ఎందుకు మౌనంగా ఉన్నారని నిలదీశారు. అయితే ఈ ఆరోపణలపై సంబంధిత వ్యక్తులు, అధికారుల వివరణ వెలువడాల్సి ఉంది.

కొత్తగా బాధ్యతలు చేపట్టిన మున్సిపల్ చైర్మన్ రాఘవరెడ్డి ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన కోరారు. మున్సిపాలిటీకి రావాల్సిన ప్రతి రూపాయిని నిబంధనల ప్రకారం వసూలు చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎగ్జిబిషన్ ప్రాంగణంలోని సామగ్రి తరలింపు విషయంలోనూ అధికారులు అప్రమత్తంగా ఉండాలని, బకాయిలు చెల్లించకుండా ఒక్క వస్తువు కూడా బయటకు వెళ్లకుండా చూడాలని అన్నారు. అలా జరిగితే దానికి మున్సిపల్ కమిషనరే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ప్రజాధనం, మున్సిపాలిటీ ఆదాయానికి సంబంధించిన అంశాల్లో నిర్లక్ష్యానికి తావులేకుండా పారదర్శకంగా వ్యవహరించాలని ఆయన పేర్కొన్నారు. బకాయిల వసూళ్లలో జాప్యం కొనసాగితే ఉన్నతాధికారులను ఆశ్రయించడంతో పాటు చట్టపరమైన చర్యలు కోరుతామని స్పష్టం చేశారు. మీడియాపై వాట్సాప్ వేదికగా దుష్ప్రచారం చేసే ప్రయత్నాలు జరిగినా వాటికి తగిన సమాధానం ఇస్తానని తెలిపారు.