BREAKING
తెలంగాణ ఆర్టీసీ నూతన వీసీ అండ్ ఎండీగా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ అనిల్ కుమార్, ఐపీఎస్ బౌరంపేట్ ప్రభుత్వ పాఠశాలలో నీటి కష్టాలు..* *కలెక్టర్‌కు బీజేపీ నాయకుల వినతి ిల్లలు ఆడుకునే బొమ్మే ప్రాణాలు తీస్తే.. ఓటీటీలో దడ పుట్టిస్తోన్న హాలీవుడ్ హారర్ థ్రిల్లర్! శ్రీ సాయినాథ్ నగర్‌లో డ్రైనేజీ సమస్యలుతక్షణమే పరిష్కరించాలని కాలనీవాసుల వినతి రష్మిక మందన్న ‘మైసా’ నుంచి ఎమోషనల్ సాంగ్ రిలీజ్.. తండ్రీకూతుళ్ల అనుబంధాన్ని కళ్లకు కట్టిన ‘ఏనాటి వరమో’! ప్రపంచ పెట్టుబడులు, వినోద రంగానికి గ్లోబల్ వేదికగా ‘ఇండియా జాయ్ – తెలంగాణ గ్లోబల్ సమిట్ సిద్ధార్థనగర్‌లో చెట్ల కొమ్మల తొలగింపు కాలనీ పరిశుభ్రత, ప్రజల భద్రతే లక్ష్యం బిగ్‌బాస్ హౌస్‌లో మాజీ కంటెస్టెంట్ల రీ ఎంట్రీ.. వర్షిణిపై అపూర్వ ఫైర్, 11వ వారం నామినేషన్స్‌లో ఉన్నది వీరే! ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో కొనసాగుతున్న యువత ఉపాధి పెంపుదల సామర్థ్యం పై సదస్సు గ్రీన్ ట్రాన్స్‌పోర్ట్ దిశగా యూరప్ కంపెనీల గళం: ఎలక్ట్రిక్ ట్రక్కుల విస్తరణకు 50+ సంస్థల డిమాండ్! జొన్నలగడ్డ చెరువులో ఆక్రమణలు తొలగింపు సన్నగా ఉంటే 'ఫిట్'గా ఉన్నట్లు కాదు! బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన ప్రేమకథా చిత్రం.. సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చిన సూపర్ హిట్ మూవీ! గుంటూరు జాబ్ మేళాలో 62 మందికి కొలువులు ప్రమాదంలో గాయపడిన రైతులకు ఎమ్మెల్యే BLR అండ.. తన వాహనంలో ఆసుపత్రికి తరలింపు

జొన్నలగడ్డ చెరువులో ఆక్రమణలు తొలగింపు

Select Suryaa Now
జొన్నలగడ్డ చెరువులో ఆక్రమణలు తొలగింపు

గుంటూరు రూరల్, మేజర్ న్యూస్: గుంటూరు రూరల్ మండలం జొన్నలగడ్డ గ్రామంలోని తాగునీటి చెరువులో అధికారులు సోమవారం ఆక్రమణలను తొలగించారు. పటిష్టమైన పోలీస్ బందోబస్తు మధ్య రెవిన్యూ, పంచాయితీ రాజ్ శాఖ అధికారులు ఆక్రమణలపై కొరడా ఝులిపించారు. గత కొంతకాలంగా ఇరిగేషన్ చెరువు కొందరు ఆక్రమించి సాగు చేస్తున్నారు. అలాగే చెరువు కట్టపై కోళ్ల ఫారాల షెడ్లను నిర్మించారు. ఈ విషయంపై గ్రామానికి చెందిన ఒక వ్యక్తి కోర్టు ను ఆశ్రయించారు. కోర్టు ఉత్తర్వుల మేరకు సుమారు మూడు నెలల క్రితం అధికారులు ఆక్రమణదారులకు ముందస్తుగా నోటీసులు జారీ చేశారు. ఆక్రమణదారుల నుంచి ఎలాంటి జవాబు లేకపోవటంతో తొలగింపుకు శ్రీకారం చుట్టారు. ముందుగా కోళ్ల ఫారం షెడ్లను తొలగించారు. అనంతరం సుమారు 12 ఎకరాలలో సాగుచేసిన పంటలను ధ్వంసం చేశారు. ప్రక్షాళన అనంతరం నీటిపారుదల శాఖ అధికారులకు ఆ స్థలాలను అప్పగించనున్నారు. కోర్టు ఉత్తర్వుల మేరకే ఆక్రమణలను తొలగించినట్లు ఎంపీడీవో సావిత్రి విలేకరులకు తెలిపారు. నల్లపాడు స్టేషన్ సిఐ భాస్కర్ ఆధ్వర్యంలో సుమారు 70 మంది పోలీసు సిబ్బంది బందోబస్తులో పాల్గొన్నారు. ఆ క్రమంలో సమయంలో పోలీసులు ప్రధాన రహదారిపై అటువైపుగా రాకపోకలను నిలిపివేశారు. 

ఆళ్ల వీరభద్రరావు గుంటూరు జిల్లా క్రైమ్