BREAKING
జేమ్స్ బాండ్ 007గా హాలీవుడ్ స్టార్ రాబర్ట్ పాటిన్సన్.. కొత్త లుక్ సంచలనం! గ్రామాల్లోకి వరద నీరు రాకుండా చర్యలు చేపట్టాలి - తుఫానుకు ప్రత్యేక అధికారుల నియామకం ఘనంగా 'బిర్సా ముండా జయంతి చిత్రం సినిమాకి ఒక్క రూపాయి మాత్రమే తీసుకున్నా.. కారణం వెల్లడించిన తనికెళ్ల భరణి ది ప్లాజా హోటల్‌లో ఘనంగా TGTDC క్రిస్మస్ కేక్ మిక్సింగ్ వేడుకలు – ఉత్సాహంగా పాల్గొన్న అధికారులు, సిబ్బంది పత్రికా స్వేచ్ఛను కాపాడాలి: ఏపీయూడబ్ల్యూజే తెలంగాణ ఆర్టీసీ నూతన వీసీ అండ్ ఎండీగా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ అనిల్ కుమార్, ఐపీఎస్ బౌరంపేట్ ప్రభుత్వ పాఠశాలలో నీటి కష్టాలు..* *కలెక్టర్‌కు బీజేపీ నాయకుల వినతి ిల్లలు ఆడుకునే బొమ్మే ప్రాణాలు తీస్తే.. ఓటీటీలో దడ పుట్టిస్తోన్న హాలీవుడ్ హారర్ థ్రిల్లర్! శ్రీ సాయినాథ్ నగర్‌లో డ్రైనేజీ సమస్యలుతక్షణమే పరిష్కరించాలని కాలనీవాసుల వినతి రష్మిక మందన్న ‘మైసా’ నుంచి ఎమోషనల్ సాంగ్ రిలీజ్.. తండ్రీకూతుళ్ల అనుబంధాన్ని కళ్లకు కట్టిన ‘ఏనాటి వరమో’! ప్రపంచ పెట్టుబడులు, వినోద రంగానికి గ్లోబల్ వేదికగా ‘ఇండియా జాయ్ – తెలంగాణ గ్లోబల్ సమిట్ సిద్ధార్థనగర్‌లో చెట్ల కొమ్మల తొలగింపు కాలనీ పరిశుభ్రత, ప్రజల భద్రతే లక్ష్యం బిగ్‌బాస్ హౌస్‌లో మాజీ కంటెస్టెంట్ల రీ ఎంట్రీ.. వర్షిణిపై అపూర్వ ఫైర్, 11వ వారం నామినేషన్స్‌లో ఉన్నది వీరే! ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో కొనసాగుతున్న యువత ఉపాధి పెంపుదల సామర్థ్యం పై సదస్సు

తెలంగాణ ఆర్టీసీ నూతన వీసీ అండ్ ఎండీగా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ అనిల్ కుమార్, ఐపీఎస్

Select Suryaa Now
తెలంగాణ ఆర్టీసీ నూతన వీసీ అండ్ ఎండీగా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ అనిల్ కుమార్, ఐపీఎస్
 తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ  నూతన వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గా సీనియర్ ఐపీఎస్ అధికారి డాక్టర్ అనిల్ కుమార్  సోమవారం బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్ బస్ భవన్‌లో ఆయన బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా సంస్థ ఉన్నతాధికారులు, సిబ్బంది ఆయనకు పుష్పగుచ్ఛాలు అందించి ఘనంగా స్వాగతం పలికారు.
బాధ్యతల స్వీకరణ అనంతరం ఎండీ డాక్టర్ అనిల్ కుమార్  సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు (ఈడీలు) సిహెచ్. వెంకన్న, ఎం. రాజశేఖర్, సాలోమాన్ రాజ్, ఖుష్రో షా ఖాన్, ఏ. శ్రీధర్, ఫైనాన్షియల్ అడ్వైజర్ విజయపుష్ప లతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో సంస్థ ప్రస్తుత ఆర్థిక పరిస్థితి, ఆపరేషన్స్, ప్రయాణికులకు అందుతున్న రవాణా సదుపాయాలు మరియు కొనసాగుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులతో ఆయన సమీక్షించారు.
ఈ సందర్భంగా ఎండీ డాక్టర్ అనిల్ కుమార్  మాట్లాడుతూ, సంస్థ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న ఉద్యోగుల సంక్షేమమే తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తామని, వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపి సంస్థను మరింత బలోపేతం చేస్తామని పేర్కొన్నారు.
అదేవిధంగా, రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు మరింత సురక్షితమైన, సౌకర్యవంతమైన మరియు నాణ్యమైన ప్రయాణ సేవలను అందించేందుకు నిరంతరం కృషి చేస్తామని ఆయన తెలిపారు. ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటూ ప్రయాణికుల ఆదరణను మరింత పెంచుకోవాలని, టీమ్ వర్క్‌తో పనిచేసి టీజీఎస్ఆర్టీసీని దేశంలోనే అగ్రగామి రవాణా సంస్థగా తీర్చిదిద్దాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.