BREAKING
రామాయణంలో కైకేయి పాత్రపై లారా దత్తా ఆసక్తికర వ్యాఖ్యలు ఏకాదశ రుద్రుల ఆధ్యాత్మిక మరియు సాంస్కృతిక విశిష్టత అమెరికాలో కుప్పకూలిన బ్యాంకింగ్ సర్వర్లు.. ఖాతాదారుల బెంబేలు! ఆకట్టుకుంటున్న ‘ది సెస్సో’ ట్రైలర్.. చిత్ర యూనిట్‌ను ప్రశంసించిన ఆకాష్ జగన్నాథ్! ఐదు భాషల్లో భారీ పాన్ ఇండియా డివోషనల్ మూవీ.. వారాహి అమ్మన్ టైటిల్ ఖరారు! జేమ్స్ బాండ్ 007గా హాలీవుడ్ స్టార్ రాబర్ట్ పాటిన్సన్.. కొత్త లుక్ సంచలనం! గ్రామాల్లోకి వరద నీరు రాకుండా చర్యలు చేపట్టాలి - తుఫానుకు ప్రత్యేక అధికారుల నియామకం ఘనంగా 'బిర్సా ముండా జయంతి చిత్రం సినిమాకి ఒక్క రూపాయి మాత్రమే తీసుకున్నా.. కారణం వెల్లడించిన తనికెళ్ల భరణి ది ప్లాజా హోటల్‌లో ఘనంగా TGTDC క్రిస్మస్ కేక్ మిక్సింగ్ వేడుకలు – ఉత్సాహంగా పాల్గొన్న అధికారులు, సిబ్బంది పత్రికా స్వేచ్ఛను కాపాడాలి: ఏపీయూడబ్ల్యూజే తెలంగాణ ఆర్టీసీ నూతన వీసీ అండ్ ఎండీగా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ అనిల్ కుమార్, ఐపీఎస్ బౌరంపేట్ ప్రభుత్వ పాఠశాలలో నీటి కష్టాలు..* *కలెక్టర్‌కు బీజేపీ నాయకుల వినతి ిల్లలు ఆడుకునే బొమ్మే ప్రాణాలు తీస్తే.. ఓటీటీలో దడ పుట్టిస్తోన్న హాలీవుడ్ హారర్ థ్రిల్లర్! శ్రీ సాయినాథ్ నగర్‌లో డ్రైనేజీ సమస్యలుతక్షణమే పరిష్కరించాలని కాలనీవాసుల వినతి

గ్రామాల్లోకి వరద నీరు రాకుండా చర్యలు చేపట్టాలి - తుఫానుకు ప్రత్యేక అధికారుల నియామకం

Select Suryaa Now
గ్రామాల్లోకి వరద నీరు రాకుండా చర్యలు చేపట్టాలి  - తుఫానుకు ప్రత్యేక అధికారుల నియామకం

గుంటూరు: అక్వాన్ తుఫాను వలన సంభవించే వరదల వలన గ్రామాల్లోకి వరద నీరు రాకుండా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ సి.యం.సాయికాంత్ వర్మ ఆదేశించారు. గ్రామస్తులతో మాట్లాడి వరద ప్రవాహం దిశను నిర్ధారణ చేసుకుని తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తుఫానుకు ప్రత్యేక అధికారులను నియమించడం జరిగిందని, అధికారులు అందరూ క్షేత్ర స్థాయిలో పర్యటించాలని ఆదేశించారు. అక్వాన్ తుఫాను ప్రభావం జిల్లాపై తీవ్రంగా ఉంటుందని హెచ్చరికలు ఉన్నాయని, జిల్లా యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు. అక్వాన్ తుఫానుపై మంగళవారం ఉదయం అధికారులతో టెలి కాన్ఫరెన్స్ ను జిల్లా కలెక్టర్ నిర్వహించారు. సాగునీటి కాలువలకు ఇటీవల తుఫాన్లకు పడిన గండ్లను తక్షణం పూడ్చాలని జలవనరుల శాఖ అధికారులను ఆదేశించారు. జిల్లాలో 19, 20 తేదీల్లో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం లో 08632234014 ఫోన్ నంబర్ తో కంట్రోల్ రూమ్ పనిచేస్తుందన్నారు. శిధిలావస్థలో ఉన్న భవనాల వద్దకు ఎవరు వెళ్ళవద్దని, అందులో ఎవరు నివసించరాదని విజ్ఞప్తి చేశారు. చెరువులు, వాగులు, వంకల వద్దకు ఎవరు వెళ్ళవద్దని, దాటుటకు ప్రయత్నించవద్దని కోరారు. ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా పూర్తి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. త్రాగునీరు ఎటువంటి పరిస్థితుల్లో కలుషితం కాకుండా స్పష్టమైన పర్యవేక్షణ జరగాలని మున్సిపల్, గ్రామీణ నీటి సరఫరా అధికారులను ఆదేశించారు. 50 నుండి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వేస్తాయని పేర్కొన్నారు. హోర్టింగులు తొలగించాలని ఆదేశించారు. అన్ని విద్యుత్ సబ్ స్టేషన్ ల వద్ద ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇతర జిల్లాలకు వెళ్లిన సిబ్బంది తక్షణం వెనుకకు రావాలని, సామగ్రి సంబంధిత శాఖలు పూర్తి స్థాయిలో సిద్ధం చేయాలని సూచించారు. తుఫాన్ పట్ల రైతులను అప్రమత్తం చేయాలని అవసరమైన సూచనలు సలహాలను అందించాలని వ్యవసాయ ఉద్యానవన శాఖలను ఆదేశించారు. పశువులకు సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో పాటు వాటికి తగిన ఆహారము అందే విధంగా పశుసంవర్ధక శాఖ చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు.ఈ టెలి కాన్ఫరెన్స్ లో జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, జిల్లా రెవిన్యూ అధికారి ఎన్.ఎస్.కె.ఖాజావలి, రెవిన్యూ డివిజనల్ అధికారి కె.శ్రీనివాస రావు, తెనాలి రెవిన్యూ డివిజనల్ అధికారి. కె.శ్రీరమణి,  మున్సిపల్ కమిషనర్లు, సంబంధిత జిల్లా అధికారులు పాల్గొన్నారు.

సూర్య.నాయక్