BREAKING
జేమ్స్ బాండ్ 007గా హాలీవుడ్ స్టార్ రాబర్ట్ పాటిన్సన్.. కొత్త లుక్ సంచలనం! గ్రామాల్లోకి వరద నీరు రాకుండా చర్యలు చేపట్టాలి - తుఫానుకు ప్రత్యేక అధికారుల నియామకం ఘనంగా 'బిర్సా ముండా జయంతి చిత్రం సినిమాకి ఒక్క రూపాయి మాత్రమే తీసుకున్నా.. కారణం వెల్లడించిన తనికెళ్ల భరణి ది ప్లాజా హోటల్‌లో ఘనంగా TGTDC క్రిస్మస్ కేక్ మిక్సింగ్ వేడుకలు – ఉత్సాహంగా పాల్గొన్న అధికారులు, సిబ్బంది పత్రికా స్వేచ్ఛను కాపాడాలి: ఏపీయూడబ్ల్యూజే తెలంగాణ ఆర్టీసీ నూతన వీసీ అండ్ ఎండీగా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ అనిల్ కుమార్, ఐపీఎస్ బౌరంపేట్ ప్రభుత్వ పాఠశాలలో నీటి కష్టాలు..* *కలెక్టర్‌కు బీజేపీ నాయకుల వినతి ిల్లలు ఆడుకునే బొమ్మే ప్రాణాలు తీస్తే.. ఓటీటీలో దడ పుట్టిస్తోన్న హాలీవుడ్ హారర్ థ్రిల్లర్! శ్రీ సాయినాథ్ నగర్‌లో డ్రైనేజీ సమస్యలుతక్షణమే పరిష్కరించాలని కాలనీవాసుల వినతి రష్మిక మందన్న ‘మైసా’ నుంచి ఎమోషనల్ సాంగ్ రిలీజ్.. తండ్రీకూతుళ్ల అనుబంధాన్ని కళ్లకు కట్టిన ‘ఏనాటి వరమో’! ప్రపంచ పెట్టుబడులు, వినోద రంగానికి గ్లోబల్ వేదికగా ‘ఇండియా జాయ్ – తెలంగాణ గ్లోబల్ సమిట్ సిద్ధార్థనగర్‌లో చెట్ల కొమ్మల తొలగింపు కాలనీ పరిశుభ్రత, ప్రజల భద్రతే లక్ష్యం బిగ్‌బాస్ హౌస్‌లో మాజీ కంటెస్టెంట్ల రీ ఎంట్రీ.. వర్షిణిపై అపూర్వ ఫైర్, 11వ వారం నామినేషన్స్‌లో ఉన్నది వీరే! ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో కొనసాగుతున్న యువత ఉపాధి పెంపుదల సామర్థ్యం పై సదస్సు

శ్రీ సాయినాథ్ నగర్‌లో డ్రైనేజీ సమస్యలుతక్షణమే పరిష్కరించాలని కాలనీవాసుల వినతి

Select Suryaa Now
శ్రీ సాయినాథ్ నగర్‌లో డ్రైనేజీ సమస్యలుతక్షణమే పరిష్కరించాలని కాలనీవాసుల వినతి
నిజాంపేట్ మేజర్ న్యూస్ నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శ్రీ సాయినాథ్ నగర్ కాలనీలో నెలకొన్న డ్రైనేజీ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ సోమవారం కాలనీవాసులు మున్సిపల్ డిప్యూటీ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. గత కొంతకాలంగా డ్రైనేజీ వ్యవస్థ సరిగా పనిచేయకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. కాలనీలోని మొదటి రోడ్డులో గత సంవత్సరం కాలంగా దెబ్బతిన్న డ్రైనేజీ మాన్‌హోళ్లు మరమ్మతులకు నోచుకోకపోవడంతో మురుగునీటి ప్రవాహానికి ఇబ్బందులు ఏర్పడుతున్నాయని తెలిపారు. దెబ్బతిన్న మాన్‌హోళ్లను వెంటనే పునర్నిర్మించడంతో పాటు డ్రైనేజీ పైప్‌లైన్లను పూర్తిస్థాయిలో శుభ్రం చేయాలని కోరారు. డ్రైనేజీ లైన్లు పూడుకుపోవడం, మురుగునీరు సక్రమంగా వెళ్లకపోవడంతో పలు ప్రాంతాల్లో మురుగునీరు రోడ్లపైకి వస్తోందని పేర్కొన్నారు. రోడ్లపై మురుగునీరు నిలిచిపోవడం వల్ల కాలనీవాసులు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారని, దుర్వాసనతో పాటు దోమల బెడద కూడా పెరుగుతోందని తెలిపారు. దీంతో పరిసరాల్లో పారిశుద్ధ్య సమస్యలు ఏర్పడటంతో ప్రజల ఆరోగ్యంపై ప్రభావం పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నందున సమస్యను నిర్లక్ష్యం చేయకుండా అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. డ్రైనేజీ మాన్‌హోళ్లను పునర్నిర్మించడం, పైప్‌లైన్లను పూర్తిగా శుభ్రం చేయడం, మురుగునీరు రోడ్లపైకి రాకుండా అవసరమైన మరమ్మతులు చేపట్టడంతో పాటు భవిష్యత్‌లో సమస్య పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కారం చూపాలని కాలనీవాసులు కోరారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదుపై అధికారులు స్పందించి సమస్యను పరిశీలించి త్వరితగతిన చర్యలు తీసుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆకుల సతీష్, కృష్ణారావు, శ్రీనివాస్, మాధవరావు, అంకం సతీష్ తదితర కాలనీవాసులు పాల్గొన్నారు.