BREAKING
ఫ్రాన్స్–మలేషియా దౌత్య బంధంలో కొత్త అధ్యాయం: రక్షణ, ఖనిజ రంగాల్లో కీలక చర్చలు! సర్పంచ్ పీఠాలపై గురి ఏఐపై ఏపీఈసీ దేశాల కీలక నిర్ణయం: సురక్షిత, సమగ్ర వినియోగానికి సభ్య దేశాల మద్దతు! తుఫాను ముప్పు నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలి వాణిజ్య ఉద్రిక్తతలకు తెరదించే దిశగా అడుగులు: త్వరలో భేటీ కానున్న ట్రంప్, జిన్‌పింగ్! భక్తిశ్రద్ధలతో 25వ మహా పాదయాత్రలో పాల్గొన్న ఎమ్మెల్సీ దండే విఠల్ భారత స్టాక్ మార్కెట్ల తాజా అప్‌డేట్: 100+ పాయింట్ల లాభంలో సెన్సెక్స్, 25,300 దాటిన నిఫ్టీ! నేడు బెజ్జుర్ మండల కేంద్రం లోని రైతు వేదికలో చేయూత పెన్షన్ పత్రాల పంపిణీ,వాయిదా... ఫారెక్స్ మార్కెట్లో రూపాయి జోరు: డాలర్‌తో పోలిస్తే 93.72 వద్ద బలంగా ప్రారంభం! అమెరికా ఆంక్షలకు చైనా చెక్: స్వదేశీ చిప్‌లు, సరికొత్త ఏఐ వ్యూహంతో రంగంలోకి టెక్ దిగ్గజాలు! డేవిడ్ జోన్స్ సంక్షోభం: A$459 మిలియన్లకు చేరిన అప్పులు, సగం స్టోర్ల (19) మూసివేతకు నిర్ణయం! శ్రీకాళహస్తి పట్టణంలో నామినేషన్లు పూర్తి పేకాట శిబిరంపై పోలీసుల దాడి.. రూ.5,200 నగదు స్వాధీనం. క్రూడ్ ఆయిల్ మార్కెట్ అప్‌డేట్: అంతర్జాతీయంగా తగ్గిన ముడిచమురు ధరలు! ఆసియా స్టాక్ మార్కెట్లలో టెక్ షేర్ల కుదుపు: భారీ నష్టాల్లో జపాన్, దక్షిణ కొరియా సూచీలు!

భక్తిశ్రద్ధలతో 25వ మహా పాదయాత్రలో పాల్గొన్న ఎమ్మెల్సీ దండే విఠల్

Select Suryaa Now
భక్తిశ్రద్ధలతో 25వ మహా పాదయాత్రలో పాల్గొన్న ఎమ్మెల్సీ దండే విఠల్

సూర్య,కాగజ్‌నగర్:  భక్తి పారవశ్యంతో జై శ్రీరామ్.. జై హనుమాన్ నామస్మరణల మధ్య టోంకిని శ్రీ సిద్ధి హనుమాన్ స్వామి 25వ మహా పాదయాత్ర మంగళవారం వైభవంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా కాగజ్‌నగర్ పట్టణంలోని బాలభారతి హనుమాన్ ఆలయంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అక్కడి నుంచి టోంకిని శ్రీ సిద్ధి హనుమాన్ ఆలయం వరకు చేపట్టిన మహా పాదయాత్రలో భక్తిశ్రద్ధలతో పాల్గొంటూ బయలుదేరారు.25వ మహా పాదయాత్రలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని హనుమాన్ నామస్మరణతో ముందుకు సాగారు. భక్తుల జై శ్రీరామ్, జై హనుమాన్ నినాదాలతో పాదయాత్ర మార్గమంతా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. టోంకిని సిద్ధి హనుమాన్ స్వామి దర్శనం కోసం తరలివచ్చిన భక్తులతో పాదయాత్రలో సందడి నెలకొంది. ఈ సందర్భంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విట్టల్ మాట్లాడుతూ సిర్పూర్ నియోజకవర్గ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో,సుఖసంతోషాలతో కలకాలం చల్లగా జీవించాలని ఈ పాదయాత్ర చేసినట్టు ఆయన వెల్లడించారు.