BREAKING
అక్రమ లేఅవుట్‌.. ప్లాట్ల విక్రయం.. పీడీ యాక్ట్‌ ప్రయోగం! కుప్పిగానిపల్లి పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా ఆశారాణి సుబ్రమణ్యం దూసుకొస్తున్న అక్వాన్ తుఫాన్.... *డిసెంబర్‌ 15 నుంచి ఆశా వర్కర్ల నిరవధిక సమ్మె..!* -- *ప్రజావాణిలో కలెక్టర్‌కు సమ్మె నోటీసు* ఆపత్కాలంలో ఆపన్న హస్తం ముఖ్యమంత్రి సహాయ నిధి నిరు పేదల జీవితాల్లో పెన్షన్ల వెలుగులు! రాయికోడ్ మండలానికి 584 నూతన పెన్షన్లు మంజూరు మూడేళ్లయినా అమలుకాని రూ.4 వేల పెన్షన్ హామీ! అర్హులైన లబ్ధిదారులకు చేయూత పెన్షన్ మంజూరి పత్రాలు అందజేసిన ఎమ్మెల్యే సంజీవరెడ్డి పల్లె ప్రకృతి ఒడిలో ఫార్మ్ ఎలైట్ రిసార్ట్ ప్రారంభం 9 కోట్లతో భారీ నందీశ్వర స్వామి విగ్రహ నిర్మాణం 684 టన్నుల ఏకశిలతో సువర్ణ శృంగ నందీశ్వర విగ్రహం కాంగ్రెస్ హామీల అమలుకు మిగిలింది రెండేళ్లే! మూడేళ్లు గడిచినా పూర్తిస్థాయిలో అమలుకాని హామీలు జిన్నారం - బొంతపల్లి రోడ్డుపై ప్రమాదకర గుంతలు వాహనదారులకు పొంచి ఉన్న ప్రమాదం నైపుణ్య విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు వృత్తి కోర్సులపై ప్రత్యక్ష అవగాహన యాసంగి పంటలు షురూ.. కాలం కరుణిస్తుందా? కరువు ఛాయాల్లో యాసంగి సాగుకు సిద్ధమవుతున్న రైతన్నలు నేటి పంచాంగం 17 నవంబర్, 2026

అక్రమ లేఅవుట్‌.. ప్లాట్ల విక్రయం.. పీడీ యాక్ట్‌ ప్రయోగం!

Select Suryaa Now
 అక్రమ లేఅవుట్‌.. ప్లాట్ల విక్రయం.. పీడీ యాక్ట్‌ ప్రయోగం!

రాంపల్లిలో వివాదాస్పద భూములపై అక్రమంగా లేఅవుట్‌ ఏర్పాటు చేసి విక్రయాలు  ::   పంజాల జైహింద్‌ గౌడ్‌పై నిర్బంధ చట్టం.. చర్లపల్లి జైలుకు తరలింపు

::మేడ్చల్ జిల్లా ప్రతినిధి, మేజర్ న్యూస్ (నవంబర్, 17)::  వివాదాస్పద భూముల్లో అక్రమ లేఅవుట్‌ ఏర్పాటు చేసి, అమాయక ప్రజలకు ప్లాట్లు విక్రయిస్తూ మోసాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిపై మల్కాజిగిరి పోలీసులు పీడీ యాక్ట్‌ ప్రయోగించారు. కీసర మండలం రాంపల్లి పరిధిలో చోటుచేసుకున్న ఈ వ్యవహారంలో పంజాల జైహింద్‌ గౌడ్‌ (63)పై ఈ నెల 13న నిర్బంధ చట్టం కింద చర్యలు తీసుకున్నారు.           వివరాల్లోకి వెళితే.. రాంపల్లిలోని వివాదాస్పద భూముల్లో ఎలాంటి అనుమతులు లేకుండా లేఅవుట్‌ ఏర్పాటు చేసిన నిందితుడు, సదరు భూములకు స్పష్టమైన యాజమాన్య హక్కులు, చట్టబద్ధమైన అనుమతులు ఉన్నాయని నమ్మించి అమాయక కొనుగోలుదారులకు ప్లాట్లు విక్రయించినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ వ్యవహారంలో 2026లో పోచారం ఐటీ కారిడార్‌ పోలీస్‌స్టేషన్‌లో ఆయనపై పలు కేసులు నమోదయ్యాయి. వరుసగా నమోదవుతున్న కేసుల నేపథ్యంలో ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పీడీ యాక్ట్‌ అమలు చేసినట్లు తెలిపారు. అనంతరం ఆయనను చర్లపల్లి కేంద్ర కారాగారానికి తరలించారు.          ఈ సందర్భంగా మల్కాజిగిరి పోలీస్‌ కమిషనర్‌ బి. సుమతి, ఐపీఎస్‌ మాట్లాడుతూ.. భూకబ్జాలు, అక్రమ భూ లావాదేవీలు, ప్రజలను మోసం చేసే చర్యలకు పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు.

ప్లాట్ల కొనుగోలుదారులు అప్రమత్తం!                  ప్రజలు ప్లాట్లు కొనుగోలు చేసే ముందు భూమి యాజమాన్య హక్కులు, టైటిల్‌ డాక్యుమెంట్లు, లేఅవుట్‌ అనుమతులు, ఇతర చట్టపరమైన అంశాలను పూర్తిస్థాయిలో పరిశీలించాలని పోలీసులు సూచించారు. కేవలం విక్రయదారుల మాటలు నమ్మి డబ్బులు చెల్లించవద్దని, మోసపూరిత రియల్‌ ఎస్టేట్‌ లావాదేవీల పట్ల అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.