శ్రీకాళహస్తి పట్టణంలో నామినేషన్లు పూర్తి
శ్రీకాళహస్తి సూర్య న్యూస్: శ్రీకాళహస్తి పట్టణం పురపాలకసంఘం ఎన్నికల్లో భాగంగా మూడు రోజులు పాటు జరిగిన నామినేషన్లు దాఖలు ప్రక్రియ సోమవారం ముగిసింది. ఛైర్మన్ పదవి కోసం మొత్తం 19 నామినేషన్లు వేశారు. ఇక 44 వార్డులకు సంబంధించి మొత్తం 316 నామినేషన్లు దాఖలు చేశారు. పార్టీల వారీగా పరిశీలిస్తే... ఛైర్మన్ పదవి కోసం టీడీపీ నుంచి ఏడు నామినేషన్లు వేశారు. కాంగ్రెస్ పార్టీ నుంచి మూడు, వైసీపీ నుంచి ఏడు, సీపీఎం నుంచి రెండు వంతున నామినేషన్లు వచ్చాయి. శ్రీకాళహస్తి పట్టణంలో 44 వార్డులకు తెలుగుదేశం పార్టీ 101 నామినేషన్ లో వేయడం జరిగింది. జనసేన 24 నామినేషన్ లో వేయడం జరిగింది, కాంగ్రెస్ 5 నామినేషన్లు వేయడం జరిగింది. వైసీపీ 140 నామినేషన్లు వేయడం జరిగింది. బీజేపీ 19 నామినేషన్లు వేయడం జరిగింది. సీపీఎం 4, సీపీఐ 2, స్వతంత్ర అభ్యర్థులు 21 మొత్తం 316 నామినేషన్లు వేశారు. మంగళవారం నామినేషన్ల పరిశీలన ప్రక్రియ జరుగనుంది. 19 వ తేదీలోగా నామినేషన్లు ఉప సంహరించు కోవాల్సి ఉంటుంది. అదే రోజు పోటీలో ఉన్న అభ్యర్థులు జాబితా ప్రకటిస్తారు. శ్రీకాళహస్తి పురపాలక సంఘం ఎన్నికలకు ఈ నెల 26 వతేదీ పోలింగ్ నిర్వహిస్తారు. అవసరం అయితే 27 వతేదీ రీపోలింగ్ ఉంటుంది. 30 వతేదీ ఫలితాలు వెల్లడిస్తారు. శ్రీకాళహస్తి పట్టణంలో ఎన్డీఏ కూటమి, వైయస్సార్ పార్టీలు మధ్య తీవ్రమైన పోటీ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ కొన్ని వార్డులలో బలమైన పోటీ ఇచ్చే పరిస్థితి వస్తున్నది. సిపిఐ సిపిఎం పార్టీలు కొన్ని వార్డులకు పరిమితం అయ్యే పరిస్థితి వస్తున్నది.
వీసీ వెంకటయ్య సూర్య దినపత్రిక ఇన్చార్జి శ్రీకాళహస్తి