BREAKING
స్థానిక సంస్థల రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు: నిబంధనల అమలుపై స్పష్టీకరణ! అమెరికా స్టాక్ మార్కెట్లో డ్యూయల్ లిస్టింగ్‌పై ప్రిస్మియన్ ఫోకస్: ఏఐ డేటా సెంటర్ల డిమాండ్! అమెరికా డేటా సెంటర్ల నుంచి భారీ కాలుష్యం: డెన్మార్క్ దేశానికి సమానంగా కర్బన ఉద్గారాలు! పురుషుల్లో జుట్టు రాలడానికి శరీర అంతర్గత సమస్యలే కారణం - దక్షిణాదిలోనే పరిస్థితి అత్యంత తీవ్రం స్పెయిన్ ప్రభుత్వం కీలక నిర్ణయం: 5.3% పెరిగిన కనీస వేతనాలు! అనకాపల్లికి ఆధ్యాత్మిక శోభ తెచ్చిన ప్రవచనకర్త బాల సౌజన్య. బ్యాంక్ ఆఫ్ కెనడా గవర్నర్ టిఫ్ మాక్లెమ్ కీలక నిర్ణయం: 2027 జూన్‌లో పదవీ విరమణ! స్పెయిన్‌లో కనీస వేతనాల పెంపుపై అధికారిక ప్రకటన: వచ్చే ఏడాది నుంచి అమలులోకి! ఆస్ట్రేలియా సెంట్రల్ బ్యాంక్ కీలక నిర్ణయం: 18 ఏళ్ల గరిష్ఠానికి (4.85%) చేరిన వడ్డీ రేటు! జపాన్ మార్కెట్లకు ఎదురుదెబ్బ: 0.9% నష్టపోయిన నిక్కీ 225 సూచీ! ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం-పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి ఆసియా ఫారెక్స్ మార్కెట్లలో అప్రమత్తత: డాలర్‌తో పోలిస్తే కరెన్సీల కదలికలు స్వల్పం! భారత స్టాక్ మార్కెట్ అప్‌డేట్: ఉదయం 9:15 గంటలకు ప్రారంభం కానున్న నేటి ట్రేడింగ్! అమెరికా స్టాక్ మార్కెట్ ముగింపు (నవంబర్ 16): భారీగా నష్టపోయిన ప్రధాన సూచీలు! కార్తీక వనభోజన కార్యక్రమానికి ఎమ్మెల్యే అమిలినేనికి ఆహ్వానం.

రూ.. 25.6 లక్షలకు సర్పంచ్ పదవి నక్కలపల్లి లో ఏకగ్రీవం.

Select Suryaa Now
రూ.. 25.6  లక్షలకు సర్పంచ్ పదవి నక్కలపల్లి లో ఏకగ్రీవం.

బెళుగుప్ప: అనంతపురం జిల్లా బెళుగుప్ప మండలం నక్కలపల్లి గ్రామంలో సర్పంచ్ ఎంపిక ఆసక్తికరంగా మారింది. ఎన్నికల సమయంలో జరిగే ఖర్చులు, వివాదాలకు దూరంగా ఉండటంతో పాటు గ్రామాభివృద్ధికి నిధులు సమకూర్చుకోవాలనే ఉద్దేశంతో గ్రామస్తులు వినూత్న పద్ధతిని అనుసరించారు. జనరల్ మహిళకు రిజర్వ్ అయిన సర్పంచ్ స్థానానికి తొమ్మిది మంది పోటీ పడగా, గ్రామాభివృద్ధికి తాము ఎంత మొత్తం అందించగలమో అభ్యర్థులు చీటీలపై రాసి డబ్బాలో వేశారు. అనంతరం గ్రామస్తుల సమక్షంలో చీటీలను పరిశీలించగా, సుదర్శనరెడ్డి తన భార్య అఖిల పేరుతో అత్యధికంగా రూ.25.6 లక్షలు అందించేందుకు ముందుకు వచ్చారు. దీంతో గ్రామస్తులు అఖిలను ఏకగ్రీవంగా ఎంపిక చేసినట్లు సమాచారం. నక్కలపల్లిలో గత ఎన్నికల సమయంలోనూ ఇదే తరహా విధానాన్ని అనుసరించారు. అప్పట్లో రామిరెడ్డి రూ.21 లక్షలు అందించేందుకు ముందుకు వచ్చి సర్పంచ్‌గా ఎంపికయ్యారు. ఈసారి ఆ మొత్తాన్ని మించి రూ.25.6 లక్షలు ప్రకటించడంతో గ్రామంలో ఈ ఎంపిక ప్రక్రియ చర్చనీయాంశంగా మారింది. గ్రామాభివృద్ధికి నిధులు సమకూర్చుకోవాలనే ఆలోచన ఒకవైపు ఉన్నప్పటికీ, సర్పంచ్ పదవిని డబ్బు ఆధారంగా ఎంపిక చేయడంపై ప్రజాస్వామ్య విలువలు, ఎన్నికల నిబంధనల కోణంలోనూ చర్చ జరుగుతోంది. గ్రామస్తుల ఏకగ్రీవ నిర్ణయంతో పాటు అధికారిక ఎన్నికల ప్రక్రియ, నిబంధనలు కూడా తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది.