కూటమి అభ్యర్థుల గెలుపు కోసం మహిళల కదంతొక్కుడు.
పాతపట్నం మేజర్ న్యూస్:
వీధుల్లో ముమ్మర ప్రచారం.
సైలాడ సతీష్, పైల లక్ష్మిలను భారీ మెజారిటీతో గెలిపిద్దాం.. అభివృద్ధికి బాటలు వేద్దాం.
మహిళల సంక్షేమం, గ్రామ ప్రగతి కూటమితోనే సాధ్యం.
ప్రతి ఇంటి గడప తట్టి.. అభివృద్ధి నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్దాo
పాతపట్నం మేజర్ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా తెలుగుదేశం పార్టీ మరియు కూటమి బలపరిచిన అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుతూ ఎంపీటీసీ పైల ప్రియాంక ఆధ్వర్యంలో మహిళలు సోమవారం సాయంత్రం ముమ్మరంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సైలాడ సతీష్ మరియు వార్డు మెంబర్ అభ్యర్థిగా బరిలో ఉన్న పైల లక్ష్మిలకు మద్దతుగా స్థానిక పండితి వీధి, దువ్వార వీధి, మరియు బ్రాహ్మణ వీధుల్లో మహిళా నాయకురాళ్లు, కార్యకర్తలు ఇంటింటికీ తిరుగుతూ ఓటర్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఎంపీటీసీ పైల ప్రియాంక మాట్లాడుతూ, పాతపట్నం మేజర్ పంచాయతీ సర్వతోముఖాభివృద్ధి చెందాలంటే సమర్థవంతమైన నాయకత్వం అవసరమని, అందుకోసం సర్పంచ్ అభ్యర్థి సైలాడ సతీష్ మరియు వార్డు మెంబర్ అభ్యర్థి పైల లక్ష్మిలను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని స్థానిక ప్రజలకు, ముఖ్యంగా మహిళా ఓటర్లకు పిలుపునిచ్చారు. ఆయా వీధుల్లోని మౌలిక సదుపాయాల కల్పన, పారిశుద్ధ్య మెరుగుదల, తాగునీటి సమస్యల పరిష్కారం మరియు మహిళల అభ్యున్నతి కోసం అభ్యర్థులు కట్టుబడి ఉన్నారని ఆమె ఓటర్లకు వివరించారు. ప్రచారంలో భాగంగా ప్రతి ఇంటి గడపకు వెళ్లిన మహిళా బృందానికి ఆయా వీధుల వాసుల నుంచి విశేష స్పందన లభించగా, అభ్యర్థుల విజయానికి తమ వంతు పూర్తి సహకారం అందిస్తామని స్థానికులు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో స్థానిక మహిళలు, పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొని ప్రచారాన్ని విజయవంతం చేశారు.
సూర్య ప్రతినిధి, పాతపట్నం.