BREAKING
కళ్యాణదుర్గం పట్టణంలో తెల్లవారుజామునే ఎమ్మెల్యే అమిలినేని పర్యటన. బీసీ సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థుల నరకయాతన : అధికారుల నిర్లక్ష్యంపై బహుజన యువసేన ఆగ్రహం : జిల్లా బీసీ సంక్షేమ శాఖాధికారికి వినతిపత్రం సమర్పణ కూటమి అభ్యర్థుల గెలుపు కోసం మహిళల కదంతొక్కుడు. కంబదూర్ మల్లేశ్వర స్వామి దేవాలయంలో కార్తీక పూజలు. అక్రమ లేఅవుట్‌.. ప్లాట్ల విక్రయం.. పీడీ యాక్ట్‌ ప్రయోగం! కుప్పిగానిపల్లి పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా ఆశారాణి సుబ్రమణ్యం దూసుకొస్తున్న అక్వాన్ తుఫాన్.... *డిసెంబర్‌ 15 నుంచి ఆశా వర్కర్ల నిరవధిక సమ్మె..!* -- *ప్రజావాణిలో కలెక్టర్‌కు సమ్మె నోటీసు* ఆపత్కాలంలో ఆపన్న హస్తం ముఖ్యమంత్రి సహాయ నిధి నిరు పేదల జీవితాల్లో పెన్షన్ల వెలుగులు! రాయికోడ్ మండలానికి 584 నూతన పెన్షన్లు మంజూరు మూడేళ్లయినా అమలుకాని రూ.4 వేల పెన్షన్ హామీ! అర్హులైన లబ్ధిదారులకు చేయూత పెన్షన్ మంజూరి పత్రాలు అందజేసిన ఎమ్మెల్యే సంజీవరెడ్డి పల్లె ప్రకృతి ఒడిలో ఫార్మ్ ఎలైట్ రిసార్ట్ ప్రారంభం 9 కోట్లతో భారీ నందీశ్వర స్వామి విగ్రహ నిర్మాణం 684 టన్నుల ఏకశిలతో సువర్ణ శృంగ నందీశ్వర విగ్రహం కాంగ్రెస్ హామీల అమలుకు మిగిలింది రెండేళ్లే! మూడేళ్లు గడిచినా పూర్తిస్థాయిలో అమలుకాని హామీలు

బీసీ సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థుల నరకయాతన : అధికారుల నిర్లక్ష్యంపై బహుజన యువసేన ఆగ్రహం : జిల్లా బీసీ సంక్షేమ శాఖాధికారికి వినతిపత్రం సమర్పణ

Select Suryaa Now
బీసీ సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థుల నరకయాతన : అధికారుల నిర్లక్ష్యంపై బహుజన యువసేన ఆగ్రహం : జిల్లా బీసీ సంక్షేమ శాఖాధికారికి వినతిపత్రం సమర్పణ

​

మదనపల్లి,మేజర్ న్యూస్ : అన్నమయ్య జిల్లాలోని బీసీ సంక్షేమ వసతి గృహాలలో (బీసీ వెల్ఫేర్ హాస్టల్స్) నెలకొన్న తీవ్ర సమస్యలు,నాసిరకం భోజనం,అధికారుల పర్యవేక్షణ లోపంపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బహుజన యువసేన ఆధ్వర్యంలో జిల్లా బీసీ సంక్షేమ శాఖాధికారికి సోమవారం వినతిపత్రం సమర్పించడం జరిగింది.​ఈ సందర్భంగా బహుజన యువసేన అధ్యక్షులు పునీత్ కుమార్ మాట్లాడుతూ అధికారుల తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.ఈ  సందర్భం ఆయన మాట్లాడుతూ పేద,బడుగు,బలహీన వర్గాల విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తుంటే,క్షేత్రస్థాయిలో అధికారుల నిర్లక్ష్యం కారణంగా విద్యార్థులు నరకయాతన అనుభవిస్తున్నారు.హాస్టళ్ల లో మెనూ చార్ట్ ఎక్కడా కనిపించడం లేదని,ఉడకని అన్నం,నీళ్లలాంటి కూరలతో విద్యార్థులు అర్ధాకలితో అలమటిస్తున్నారు.విద్యార్థులు ఉండే గదులకు కిటికీలు,తలుపులు లేక,ఫ్యాన్లు,లైట్లు పనిచేయక చదువుకోవడానికి కూడా వీలులేని దుస్థితి నెలకొంది.ఇక మరుగుదొడ్లు,స్నానపు గదులైతే దుర్గంధంతో,విరిగిన తలుపులతో అంటువ్యాధులకు నిలయాలుగా మారాయన్నారు.అసలు ఈ హాస్టళ్లను తనిఖీ చేసే నాథుడే కరువయ్యారు.వార్డెన్లు,పర్యవేక్షణాధికారులు ప్రభుత్వ నిబంధనలను పూర్తిగా గాలికి వదిలేశారు.​జిల్లా బీసీ సంక్షేమ శాఖాధికారి తక్షణమే స్పందించి ఆయా హాస్టళ్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలన్నారు.బాధ్యులైన అధికారులపై కఠిన క్రమశిక్షణా చర్యలు తీసుకుని,విద్యార్థులకు నాణ్యమైన భోజనం,మెరుగైన వసతి కల్పించాలి.లేనిపక్షంలో విద్యార్థుల హక్కుల సాధన కోసం బహుజన యువసేన ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా పెద్దఎత్తున ఉద్యమాలు,ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరిస్తున్నామని స్పష్టం చేశారు.

రిపోర్టర్ : కే.ఈశ్వర్ రెడ్డి,మదనపల్లి నియోజకవర్గం ఇంచార్జి