BREAKING
స్థానిక సంస్థల రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు: నిబంధనల అమలుపై స్పష్టీకరణ! అమెరికా స్టాక్ మార్కెట్లో డ్యూయల్ లిస్టింగ్‌పై ప్రిస్మియన్ ఫోకస్: ఏఐ డేటా సెంటర్ల డిమాండ్! అమెరికా డేటా సెంటర్ల నుంచి భారీ కాలుష్యం: డెన్మార్క్ దేశానికి సమానంగా కర్బన ఉద్గారాలు! పురుషుల్లో జుట్టు రాలడానికి శరీర అంతర్గత సమస్యలే కారణం - దక్షిణాదిలోనే పరిస్థితి అత్యంత తీవ్రం స్పెయిన్ ప్రభుత్వం కీలక నిర్ణయం: 5.3% పెరిగిన కనీస వేతనాలు! అనకాపల్లికి ఆధ్యాత్మిక శోభ తెచ్చిన ప్రవచనకర్త బాల సౌజన్య. బ్యాంక్ ఆఫ్ కెనడా గవర్నర్ టిఫ్ మాక్లెమ్ కీలక నిర్ణయం: 2027 జూన్‌లో పదవీ విరమణ! స్పెయిన్‌లో కనీస వేతనాల పెంపుపై అధికారిక ప్రకటన: వచ్చే ఏడాది నుంచి అమలులోకి! ఆస్ట్రేలియా సెంట్రల్ బ్యాంక్ కీలక నిర్ణయం: 18 ఏళ్ల గరిష్ఠానికి (4.85%) చేరిన వడ్డీ రేటు! జపాన్ మార్కెట్లకు ఎదురుదెబ్బ: 0.9% నష్టపోయిన నిక్కీ 225 సూచీ! ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం-పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి ఆసియా ఫారెక్స్ మార్కెట్లలో అప్రమత్తత: డాలర్‌తో పోలిస్తే కరెన్సీల కదలికలు స్వల్పం! భారత స్టాక్ మార్కెట్ అప్‌డేట్: ఉదయం 9:15 గంటలకు ప్రారంభం కానున్న నేటి ట్రేడింగ్! అమెరికా స్టాక్ మార్కెట్ ముగింపు (నవంబర్ 16): భారీగా నష్టపోయిన ప్రధాన సూచీలు! కార్తీక వనభోజన కార్యక్రమానికి ఎమ్మెల్యే అమిలినేనికి ఆహ్వానం.

పురుషుల్లో జుట్టు రాలడానికి శరీర అంతర్గత సమస్యలే కారణం - దక్షిణాదిలోనే పరిస్థితి అత్యంత తీవ్రం

Select Suryaa Now
పురుషుల్లో జుట్టు రాలడానికి శరీర అంతర్గత సమస్యలే కారణం - దక్షిణాదిలోనే పరిస్థితి అత్యంత తీవ్రం

హైదరాబాద్, మేజర్ న్యూస్ : భారత్‌లో పురుషులు ఎదుర్కొంటున్న జుట్టు రాలే సమస్య కేవలం బాహ్యమైనది కాదని, శరీర అంతర్గత ఆరోగ్య సమస్యలే కారణమని ప్రముఖ హెల్త్ ప్లాట్‌ఫామ్ 'ట్రయా' దేశవ్యాప్తంగా నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. దాదాపు 5.6 లక్షల మంది పురుషులపై జరిపిన ఈ సర్వే ప్రకారం.. దేశ సగటుతో పోలిస్తే తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో మానసిక ఒత్తిడి, నిద్రలేమి, మందగించిన జీవక్రియ (మెటబాలిజం) అత్యధికంగా నమోదయ్యాయి. 29 నుంచి 31 ఏళ్ల లోపు యువకులే ఈ సమస్యల బారిన పడుతున్నారు. శరీరానికి అవసరమైన పోషకాలు లోపించి అంతర్గత ఒత్తిడి పెరిగినప్పుడు దాని ప్రభావం ముందుగా జుట్టుపైనే కనిపిస్తుందని ఈ అధ్యయనం స్పష్టం చేసింది. ట్రయా హెల్త్ దేశవ్యాప్తంగా 5,61,960 మంది పురుషులపై జుట్టు రాలే దశలు, స్కాల్ప్ ఆరోగ్యం, మానసిక ఒత్తిడి, నిద్ర, జీర్ణశక్తి, మెటబాలిజంపై నిర్వహించిన అతిపెద్ద పురుషుల కేశ ఆరోగ్య అధ్యయన ఫలితాలు ఇవి. ఈ జాతీయ అధ్యయనం ఒక ప్రధాన విషయాన్ని స్పష్టం చేసింది. భారతదేశంలో జుట్టు రాలడం అనేది మధ్య వయస్కుల సమస్య మాత్రమే కాదు. జుట్టు కోల్పోతున్న పురుషుల సగటు వయసు 29 ఏళ్లు. సహాయం కోసం నిపుణులను సంప్రదించే సమయానికే వీరిలో సగానికి పైగా అంటే 55.2 శాతం మంది, ఇప్పటికే అడ్వాన్స్‌డ్ దశకు చేరుకుంటున్నారు. రాష్ట్రాల వారీగా డేటాను విశ్లేషించినప్పుడు ఒక స్పష్టమైన విషయం బయటపడింది. దేశంలోని ఏ ఇతర ప్రాంతంతో పోల్చినా తమిళనాడు, తెలంగాణ, కర్ణాటకలతో కూడిన దక్షిణాది రాష్ట్రాలు అంతర్గత ఆరోగ్య సూచీల్లో అత్యంత పేలవమైన గణాంకాలను నమోదు చేస్తున్నాయి. ప్రధానంగా మానసిక ఒత్తిడి, సరిపోని నిద్ర, తక్కువ శక్తి స్థాయిలు ఇక్కడ తీవ్రంగా ఉన్నాయి. ఈ మూడూ నేరుగా జుట్టు రాలడంతో ముడిపడి ఉన్నాయి.
​
​     ఈ సందర్భంగా ట్రయా హెల్త్ కో-ఫౌండర్ సలోని ఆనంద్ మాట్లాడుతూ పురుషులు ఊహించిన దాని కంటే చాలా చిన్న వయసులోనే జుట్టు రాలడం మొదలవుతుందన్నారు. రాష్ట్రాల వారీగా పరిశీలించినప్పుడు దక్షిణాది ప్రత్యేకంగా ఆకర్షించిందన్నారు. దానికి కారణం ఏదో ఒక ఆందోళనకరమైన అంశం మాత్రమే కాదని, ఒకే వ్యక్తిలో ఒకే సమయంలో కనిపించిన మూడు సమస్యలు అన్నారు. విపరీతమైన ఒత్తిడి, నిద్ర లేమి, తక్కువ శక్తి స్థాయిలు ఉన్నాయన్నారు. ఈ మూడూ కలిసి శరీరాన్ని నిరంతర ఒత్తిడికి గురి చేసే అంతర్గత వాతావరణాన్ని సృష్టిస్తున్నాయని పేర్కొన్నారు. ఆ ఒత్తిడి మొదటగా ప్రతిబింబించేది జుట్టు పైనేనన్నారు. ఈ అధ్యయనంలో పరిశీలించిన 11 రాష్ట్రాలలో అంతర్గత ఆరోగ్య సమస్యల విషయంలో దక్షిణాది అత్యంత ఆందోళనకరమైన ప్రాంతంగా నిలిచిందన్నారు.
​జుట్టు రాలడానికి కారణమయ్యే మూడు ప్రధాన అంశాలు ఒత్తిడి, నిద్రలేమి, మెటబాలిజం తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో జాతీయ సగటు కంటే ఎక్కువగా ఉన్నాయన్నారు. మరే ఇతర ప్రాంతంలోనూ ఈ తీవ్రమైన పరిస్థితి కనిపించలేదన్నారు. దక్షిణాదిలో జుట్టు రాలే సమస్యకు స్కాల్ప్ సమస్యలు కారణం కాదన్నారు. శరీరంలో అంతర్గతంగా జరుగుతున్న పరిణామాలే దీనికి మూలమన్నారు. అయితే, ఈ సమస్యను ఎదుర్కొంటున్న మెజారిటీ పురుషులకు ఈ రెండింటికీ సంబంధం ఉందనే విషయం తెలియదన్నారు. మూడు రాష్ట్రాలలో 95,017 మంది పురుషుల ఆరోగ్యాన్ని అంచనా వేశామన్నారు. దక్షిణాదిలోని ప్రతి రాష్ట్రం ఒత్తిడి విషయంలో జాతీయ సగటు కంటే ఎక్కువే ఉందన్నారు. ప్రతి దక్షిణాది రాష్ట్రం నిద్ర లేమి విషయంలోనూ జాతీయ సగటు కంటే ముందే ఉందన్నారు. తక్కువ శక్తి స్థాయిల (మెటబాలిజం) విషయంలో తమిళనాడు, కర్ణాటకలు జాతీయ సగటును దాటేశాయిలన్నారు.

   భారతదేశంలో అత్యధిక అంతర్గత ఒత్తిడిని ఎదుర్కొంటున్న రాష్ట్రం మూడు అంతర్గత ఆరోగ్య సూచికలలోనూ ఒకేసారి జాతీయ స్థాయిలో అగ్రస్థానంలో నిలిచిన ఏకైక రాష్ట్రం తమిళనాడు ఉంది. మరే ఇతర రాష్ట్రంలోనూ ఈ పరిస్థితి కనిపించలేదు. మానసిక ఒత్తిడి విషయంలో 64.3 శాతం దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే అత్యధికం. జాతీయ సగటు కంటే దాదాపు 10 శాతం ఎక్కువ. తమిళనాడులో ప్రతి ముగ్గురు పురుషుల్లో దాదాపు ఇద్దరు మధ్యస్థం నుంచి తీవ్రమైన ఒత్తిడికి లోనవుతున్నారు. ఇది తాత్కాలిక ఒత్తిడి కాదు. నిరంతరం కొనసాగే దైనందిన భారం. ఇది కార్టిసాల్, హార్మోన్ల అసమతుల్యత ద్వారా జుట్టు పెరుగుదల చక్రాన్ని నేరుగా దెబ్బతీస్తుంది.
నిద్ర లేమి 42.3 శాతం, దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే అత్యంత దారుణమైన పరిస్థితి. జాతీయ సగటు కంటే దాదాపు 13 శాతం ఎక్కువ. తమిళనాడులో దాదాపు ప్రతి ఇద్దరు పురుషుల్లో ఒకరు సరిగా నిద్రపోవడం లేదు. సరిపోని నిద్ర కణాల పునరుద్ధరణ (సెల్యులార్ రిపేర్), హార్మోన్ల సమతుల్యత, ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలకు అవసరమైన శరీర సామర్థ్యాన్ని దెబ్బ తీస్తుంది. దేశవ్యాప్త డేటా మొత్తంలోనే ఇది అత్యంత ఆందోళనకరమైన సూచికగా నమోదైంది. తక్కువ శక్తి స్థాయిలు: 64.1 శాతం దేశంలోనే అత్యధికం. జాతీయ సగటు కంటే 8.3 శాతం ఎక్కువ. దాదాపు ప్రతి ముగ్గురు పురుషుల్లో ఇద్దరు శక్తి లేకపోవడం లేదా అలసటను ఎదుర్కొంటున్నారు. ఇది పోషకాహార లోపాలు, జీవక్రియ (మెటబాలిక్) ఒత్తిడిని ప్రతిబింబిస్తుంది. అంటే ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలకు తోడ్పడేంత సామర్థ్యంతో శరీరం పనివచేయడం లేదు. ఒత్తిడి, నిద్రలేమి, తక్కువ శక్తి స్థాయిలు ఈ మూడూ ఒకేసారి వెంటాడుతున్నాయి. వీటిలో ప్రతి ఒక్కటి వ్యక్తిగతంగానూ జుట్టు పెరుగుదల చక్రాన్ని దెబ్బతీస్తాయి. ఈ మూడూ కలిసి శరీరంలో అంతర్గతంగా తీవ్రమైన భారాన్ని మోపుతున్నాయి. అయితే, తమిళనాడులోని చాలామంది పురుషులు తమ జుట్టు రాలడానికి దీనికి సంబంధం ఉందని ఇప్పటివరకు గుర్తించలేదు.

   అంతర్గత ఒత్తిడి స్పష్టంగా బయటపడుతున్న ప్రాంతం జాతీయ అధ్యయనంలో ఒత్తిడిలో రెండో అత్యధిక స్థాయిని, నిద్రలేమిలో రెండో అత్యంత పేలవమైన స్థాయిని తెలంగాణ నమోదు చేసింది.
​మానసిక ఒత్తిడి: 63.6 శాతం జాతీయ స్థాయిలో రెండో అత్యధికం. జాతీయ సగటు కంటే 9 శాతం ఎక్కువ. ఇది ఏళ్ల తరబడి పోగుపడుతూ వస్తున్న నిరంతర ఒత్తిడి భారం. నిద్ర లేమి 36.7 శాతం జాతీయ స్థాయిలో రెండో అత్యంత దారుణమైన పరిస్థితి. జాతీయ సగటు కంటే 7.2 శాతం ఎక్కువ.

   ప్రతి సూచికలోనూ నిలకడగా జాతీయ సగటు కంటే ఎక్కువ కర్ణాటక ఏ ఒక్క సూచికలోనూ అగ్రస్థానంలో లేకపోయినా పరీక్షించిన ప్రతి అంశంలోనూ జాతీయ సగటు కంటే ఎక్కువే ఉంది. అధ్యయనంలో మరే ఇతర రాష్ట్రంలోనూ ఇంత స్థిరమైన నమూనా కనిపించలేదు. మానసిక ఒత్తిడి 61.3 శాతం జాతీయ స్థాయిలో మూడో అత్యధికం. జాతీయ సగటు కంటే 6.7 శాతం ఎక్కువ. నిద్ర లేమి 33.4 శాతం జాతీయ స్థాయిలో మూడో అత్యంత పేలవమైన పరిస్థితి. జాతీయ సగటు కంటే 3.9 శాతం ఎక్కువ. తక్కువ శక్తి స్థాయిలు 57.3 శాతం ఇది జాతీయ సగటు అయిన 55.8 శాతం కంటే ఎక్కువ.

​    దక్షిణాది పరిస్థితులు ఏం సూచిస్తున్నాయి.  దక్షిణాదిలో జుట్టు రాలే సమస్య ప్రధానంగా మూడు నిర్దిష్ట అంశాల వల్లే వస్తోంది. మొదటి ప్రధాన కారణం మానసిక ఒత్తిడి. జాతీయ సగటు 54.6 శాతం కాగా, ఈ మూడు రాష్ట్రాల్లోనూ ఒత్తిడి స్థాయిలు 61 శాతం నుంచి 64 శాతం మధ్య నమోదయ్యాయి. నిరంతర ఒత్తిడి వల్ల పెరిగే కార్టిసాల్ హార్మోన్ జుట్టు పెరుగుదల చక్రాన్ని దెబ్బతీసి కుదుళ్లు ఎదుగుదల దశ నుంచి అకాలంగా రాలే దశకు వెళ్లేలా చేస్తుంది. జన్యుపరమైన సమస్యలు ఉన్న పురుషుల్లో ఇది డీహెచ్‌టీ స్థాయిలను పెంచి, కాలక్రమేణా కుదుళ్లు కుంచించుకుపోయే  ప్రక్రియను వేగవంతం చేస్తుంది. రెండోది నిద్ర లేమి ఇది ఒత్తిడిని మరింత తీవ్రతరం చేస్తుంది. జాతీయ సగటు 29.5 శాతం ఉండగా, ఈ మూడు రాష్ట్రాల్లో సరిగ్గా నిద్రపోని వారి శాతం 33 శాతం నుంచి 42 శాతం మధ్య ఉంది. శరీరంలో కణాల పునరుద్ధరణ (సెల్యులార్ రిపేర్) జరిగేది నిద్రలోనే. శరీరంలో అత్యంత చురుగ్గా ఉండే కణాలలో జుట్టు కుదుళ్ల కణాలు కూడా ఒకటి. దీర్ఘకాలిక నిద్రలేమి వల్ల కణాల పునరుద్ధరణ లోపం ఏర్పడి, అది ఏళ్ల తరబడి నిశ్శబ్దంగా పేరుకుపోతూ జుట్టు ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తుంది.

  మెటబాలిజం (జీవక్రియ) ఈ సమస్యను మరింత పూర్తి చేస్తుంది. జాతీయ సగటు 55.8 శాతం కాగా, తమిళనాడు 64.1 శాతం, కర్ణాటక 57.3 శాతంతో రెండూ జాతీయ సగటు కంటే ఎక్కువే ఉన్నాయి. ఇంత పెద్ద స్థాయిలో మెటబాలిజం మందగించడం అనేది పోషకాహార లోపాలు, అంతర్గత జీవక్రియ ఒత్తిడిని ప్రతిబింబిస్తుంది. శరీరం తన సరైన సామర్థ్యం కంటే తక్కువ స్థాయిలో పని చేస్తున్నప్పుడు, ప్రాణాధారమైన ముఖ్య అవయవాలకు మాత్రమే పోషకాలను మళ్లించి, జుట్టు పెరుగుదలకు ప్రాధాన్యతను తగ్గించేస్తుంది. ఫలితంగా జుట్టుకు అందాల్సిన పోషకాల సరఫరా నిలిచిపోతుంది.దక్షిణాదిలో ఈ మూడు సమస్యలూ 29 నుంచి 31 ఏళ్ల సగటు వయసున్న పురుషుల్లో ఒకేసారి కనిపిస్తున్నాయి. వీరంతా జీవితంలో అత్యంత చురుకైన, ఉత్పాదక దశలో ఉన్నవారు. తమ శరీరంలో అంతర్గతంగా జరుగుతున్న పరిణామాలకు, తమ జుట్టు రాలడానికి సంబంధం ఉందని వీరిలో అత్యధికులకు ఇప్పటివరకు ఎవరూ చెప్పలేదు. దక్షిణాదిపై ట్రయా విశ్లేషణ
​దక్షిణాది డేటా ఒక విషయాన్ని స్పష్టంగా వెల్లడిస్తోంది. దక్షిణాది పురుషుల్లో జుట్టు రాలడం అనేది కేవలం స్కాల్ప్‌కు సంబంధించిన సమస్య కాదు. ఇది శరీర అంతర్గత ఆరోగ్య సమస్య. ఆ సమస్య మొదటగా, స్పష్టంగా కనిపించే ప్రదేశం జుట్టు మాత్రమే. మానసిక ఒత్తిడిని నియంత్రించాలి. సరైన నిద్ర అవసరం ఉంది. తక్కువ మెటబాలిజానికి కారణమవుతున్న జీవక్రియ, పోషకాహార లోపాలను గుర్తించి సరిదిద్దాలి. ఇవి సాధారణ జీవనశైలి సూచనలు మాత్రమే కావు. వీటిని పట్టించుకోకుండా వదిలేస్తే, తలపై ఏమి వాడినా శరీర అంతర్గత పరిస్థితులే జుట్టు రాలడాన్ని ఏటా ఒక దశ నుంచి మరో తీవ్ర దశకు పెంచుకుంటూ పోతాయి.

స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్