BREAKING
స్థానిక సంస్థల రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు: నిబంధనల అమలుపై స్పష్టీకరణ! అమెరికా స్టాక్ మార్కెట్లో డ్యూయల్ లిస్టింగ్‌పై ప్రిస్మియన్ ఫోకస్: ఏఐ డేటా సెంటర్ల డిమాండ్! అమెరికా డేటా సెంటర్ల నుంచి భారీ కాలుష్యం: డెన్మార్క్ దేశానికి సమానంగా కర్బన ఉద్గారాలు! పురుషుల్లో జుట్టు రాలడానికి శరీర అంతర్గత సమస్యలే కారణం - దక్షిణాదిలోనే పరిస్థితి అత్యంత తీవ్రం స్పెయిన్ ప్రభుత్వం కీలక నిర్ణయం: 5.3% పెరిగిన కనీస వేతనాలు! అనకాపల్లికి ఆధ్యాత్మిక శోభ తెచ్చిన ప్రవచనకర్త బాల సౌజన్య. బ్యాంక్ ఆఫ్ కెనడా గవర్నర్ టిఫ్ మాక్లెమ్ కీలక నిర్ణయం: 2027 జూన్‌లో పదవీ విరమణ! స్పెయిన్‌లో కనీస వేతనాల పెంపుపై అధికారిక ప్రకటన: వచ్చే ఏడాది నుంచి అమలులోకి! ఆస్ట్రేలియా సెంట్రల్ బ్యాంక్ కీలక నిర్ణయం: 18 ఏళ్ల గరిష్ఠానికి (4.85%) చేరిన వడ్డీ రేటు! జపాన్ మార్కెట్లకు ఎదురుదెబ్బ: 0.9% నష్టపోయిన నిక్కీ 225 సూచీ! ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం-పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి ఆసియా ఫారెక్స్ మార్కెట్లలో అప్రమత్తత: డాలర్‌తో పోలిస్తే కరెన్సీల కదలికలు స్వల్పం! భారత స్టాక్ మార్కెట్ అప్‌డేట్: ఉదయం 9:15 గంటలకు ప్రారంభం కానున్న నేటి ట్రేడింగ్! అమెరికా స్టాక్ మార్కెట్ ముగింపు (నవంబర్ 16): భారీగా నష్టపోయిన ప్రధాన సూచీలు! కార్తీక వనభోజన కార్యక్రమానికి ఎమ్మెల్యే అమిలినేనికి ఆహ్వానం.

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం-పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి

Select Suryaa Now
ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం-పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి

రాయపర్తి , మేజర్ న్యూస్,
పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపి ఆనందంగా చూడాలన్నదే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ ద్యేయం అని ప్రజా సంక్షేమ కోసం రాష్ట్ర ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుందని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయ ఆవరణంలో  940 మంది అర్హులైన లబ్ధిదారులకు నూతన పింఛన్లను మంజూరు పత్రాలను అందజేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి కి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు డిజే పాటలతో ఘన స్వాగతం పలికారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ సమాజంలోని అట్టడుగు వర్గాల అభ్యున్నతి, పేద కుటుంబాల సంక్షేమమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ ప్రాధాన్యతలని అన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఇతర అర్హులైన వారికి పింఛన్ల రూపంలో ఆర్థిక భరోసా కల్పించడం ప్రభుత్వ బాధ్యతగా భావిస్తోందని తెలిపారు.ప్రతి కుటుంబంలో సంక్షేమ వెలుగులు నిండాలనే ఉద్దేశంతో అర్హులైన వారికి నూతన పింఛన్లు మంజూరు చేస్తున్నామని, రాయపర్తి మండలంలో 940 మందికి పింఛన్లు మంజూరు కావడం సంతోషకరమని పేర్కొన్నారు. పింఛన్ ద్వారా లబ్ధిదారులకు ప్రతినెలా ఆర్థిక చేయూత అందుతుందని, ముఖ్యంగా వృద్ధులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు.ప్రజలకు మెరుగైన పాలన అందించడంతో పాటు అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు చేరేలా ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు.గ్రామస్థాయిలో ఏ ఒక్క అర్హుడూ సంక్షేమ ఫలాలకు దూరం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులు, అధికారులపై ఉందని తెలిపారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా నియోజకవర్గ అభివృద్ధి, సంక్షేమం కోసం నిరంతరం పనిచేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో డిఆర్డీఓ నాగపద్మజ, మండల ప్రత్యేక అధికారి శ్రీకాంత్ రెడ్డి,తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీఓ శ్రీనివాసులు,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఈదులకంటి రవీందర్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు జాటోత్ హమ్యా నాయక్,సర్పంచులు గారే సహేంద్రబిక్ష పతి, గుగులోత్ స్వప్నవిజయ్, చిర్ర వేణు, రాయిని యాకన్న, కంది కట్ల స్వప్నసంతోష్,తదితరులు పాల్గొన్నారు.

రిపోర్టర్ ;సురేష్, రాయపర్తి ,వరంగల్ జిల్లా