పేకాట శిబిరంపై పోలీసుల దాడి.. రూ.5,200 నగదు స్వాధీనం.
పేకాట శిబిరంపై పోలీసుల దాడి.. రూ.5,200 నగదు స్వాధీనం.
గూడూరు, పెడన మేజర్ న్యూస్ : మండలం చిన్న ఆకులమన్నాడు గ్రామంలో నిర్వహిస్తున్న పేకాట శిబిరంపై సమాచారం రావడంతో దాడులు నిర్వహించామని గూడూరు ఎస్సై సిహెచ్ దివ్య ప్రకాష్ తెలిపారు . ఈ మేరకు దివ్య ప్రకాష్ పోలీసు సిబ్బందితో కలిసి పేకాట శిబిరంపై ఆకస్మికంగా దాడి చేశారు. ఈ దాడిలో పేకాటకు సంబంధించిన రూ.5,200 నగదును పోలీసులు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశామన్నారు.గ్రామాల్లో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.