ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో కొనసాగుతున్న యువత ఉపాధి పెంపుదల సామర్థ్యం పై సదస్సు
పెదకాకాని మేజర్ న్యూస్:ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం, మ్యాజిక్ బస్ ఇండియా ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో 'యువత ఉపాధి సామర్థ్యాల పెంపుదల – పరిశ్రమలు, విద్యాసంస్థల మధ్య సహకారం' అనే అంశంపై స్టేక్‌హోల్డర్స్ సమావేశం మంగళవారం ఉదయం 10 గంటలకు విశ్వవిద్యాలయంలోని ప్రొఫెసర్ వి. బాలమోహన్‌దాస్ సెమినార్ హాల్‌లో కొనసాగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ఆచార్య కె. గంగాధరరావు హాజరయ్యారు.
విశిష్ట అతిథులుగా మ్యాజిక్ బస్ ఇండియా ఫౌండేషన్ సీనియర్ డైరెక్టర్ (లైవ్లీహుడ్ ఆపరేషన్స్) ఆర్తి ఎన్. సింగ్, నేషనల్ డైరెక్టర్ కె. సాయి కులతుంగన్, డీజీఎం డి. శేఖర్ బాబు పాల్గొననున్నారు. గౌరవ అతిథులుగా విశ్వవిద్యాలయ రెక్టార్ ఆచార్య ఆర్. శివరామ ప్రసాద్, రిజిస్ట్రార్ ఆచార్య జి. సింహాచలం, కాలేజ్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ డీన్, వర్క్‌షాప్ కన్వీనర్ ఆచార్య వి. రవి కుమార్ పాల్గొన్నారు.
పెదకాకాని సీనియర్ రిపోర్టర్ అహ్మద్.