గుంటూరు జాబ్ మేళాలో 62 మందికి కొలువులు
ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో గుంటూరులో నిర్వహించిన జాబ్ మేళా విజయవంతమైంది.
సోమవారం గుజ్జనగుండ్ల ఉపాధి కల్పన కార్యాలయంలో నిర్వహించిన ఇంటర్వ్యూలకు 159 మంది హాజరయ్యారు. వీరిలో 62 మందికి ఉద్యోగాలు దక్కాయని అధికారి కొండా సంజీవరావు తెలిపారు. ఐసీఐసీఐ, ఎస్బీఐ కార్డ్, జెప్టో తదితర సంస్థలు పాల్గొన్నాయని చెప్పారు. కార్యక్రమంలో అధికారి క్రిషి అభినవ్ తదితరులు పాల్గొన్నారు.