BREAKING
జొన్నలగడ్డ చెరువులో ఆక్రమణలు తొలగింపు సన్నగా ఉంటే 'ఫిట్'గా ఉన్నట్లు కాదు! బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన ప్రేమకథా చిత్రం.. సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చిన సూపర్ హిట్ మూవీ! గుంటూరు జాబ్ మేళాలో 62 మందికి కొలువులు ప్రమాదంలో గాయపడిన రైతులకు ఎమ్మెల్యే BLR అండ.. తన వాహనంలో ఆసుపత్రికి తరలింపు తైవాన్ జలసంధి గగనతలంపై కొత్త రగడ: విమాన మార్గాల విషయంలో అమెరికా–చైనా మధ్య వివాదం! ఏ సినిమా పడితే అది చేశా.. నా ప్రయాణంపై శ్రీలీల సంచలన కామెంట్స్ రూ. 7 కోట్ల ఉద్యోగాల మోసం కేసు CID కి బదిలీ ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు డ్రోన్, సీసీ కెమెరాలతో నిరంతర నిఘా నాకు నిజంగా యాక్టింగ్ రాదు.. ధనుష్‌కు సారీ చెప్పిన రేణు దేశాయ్.. ఓం ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఆసక్తికర వ్యాఖ్యలు! పెదకాకని శివాలయాన్ని సందర్శించిన రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్ పోప్ లియో XIV దక్షిణ అమెరికా పర్యటన పూర్తి.. ఫ్రాన్స్–మలేషియా దౌత్య బంధంలో కొత్త అధ్యాయం: రక్షణ, ఖనిజ రంగాల్లో కీలక చర్చలు! సర్పంచ్ పీఠాలపై గురి ఏఐపై ఏపీఈసీ దేశాల కీలక నిర్ణయం: సురక్షిత, సమగ్ర వినియోగానికి సభ్య దేశాల మద్దతు!

ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు డ్రోన్, సీసీ కెమెరాలతో నిరంతర నిఘా

Select Suryaa Now
ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు డ్రోన్, సీసీ కెమెరాలతో నిరంతర నిఘా

వెల్దుర్తి ఎస్సై హెచ్చరిక  

వెల్దుర్తి, మేజర్ న్యూస్: పంచాయతీ ఎన్నికల దృష్ట్యా వెల్దుర్తి మండల పరిధిలో ఎన్నికల ప్రవర్తనా నియమావళితో పాటు 144 సీఆర్‌పీసీ, 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉన్నాయని వెల్దుర్తి పోలీస్ స్టేషన్ సబ్ ఇన్‌స్పెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు. పోలీసుల, రిటర్నింగ్ అధికారి ముందస్తు అనుమతి లేకుండా ఎలాంటి సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించరాదని స్పష్టం చేశారు. నలుగురికి మించి ఒకేచోట గుమిగూడి ఉండకూడదని పేర్కొన్నారు.  

సోషల్ మీడియాపై ప్రత్యేక నిఘా:

వాట్సాప్ గ్రూపులు, ఇతర సామాజిక మాధ్యమాల్లో తప్పుడు వార్తలు, అసత్య ప్రచారాలు, రెచ్చగొట్టే పోస్టులు పెట్టే వారిపై పోలీసు నిఘా ఉంటుందని హెచ్చరించారు. ప్రతి గ్రామంలో, పోలింగ్ బూత్‌ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని, గ్రామాలపై డ్రోన్ కెమెరాలతో నిరంతరం పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. కుల, మత, ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టే ప్రసంగాలు చేసినా, ఇతరుల మనోభావాలు దెబ్బతీసేలా అనుచిత వ్యాఖ్యలు చేసినా చట్టపరమైన చర్యలు తప్పవని పేర్కొన్నారు.  

కేసులు నమోదైతే భవిష్యత్తుకు ఆటంకం:

ఎన్నికల గొడవల్లో చిక్కుకుని కేసులు నమోదైతే వాటిని లోక్ అదాలత్‌లో కూడా కొట్టివేయడం కుదరదని ఎస్సై స్పష్టం చేశారు. ఈ కేసులు యువత ఉద్యోగాలకు, పాస్‌పోర్టుల జారీకి, విదేశీ ప్రయాణాలకు తీవ్ర ఆటంకంగా మారుతాయని, కుటుంబాల భవిష్యత్తు దెబ్బతింటుందని సూచించారు. మద్యం మత్తులో ఘర్షణలకు దిగితే రిమాండ్‌కు పంపడంతో పాటు రౌడీషీట్లు తెరుస్తామని హెచ్చరించారు. గొడవల కారణంగా గ్రామం 'రెడ్ మార్క్' జాబితాలోకి వెళ్లడమే కాకుండా ఎన్నికలు వాయిదా పడటం లేదా అభ్యర్థులు అనర్హులయ్యే ప్రమాదం ఉందన్నారు.  

పోలింగ్ కేంద్రాల వద్ద నిబంధనలు ఇవీ..

ఓటర్లు తమ ఓటరు గుర్తింపు కార్డు లేదా ఆధార్ కార్డుతో పాటు ఓటరు స్లిప్‌ను తప్పనిసరిగా వెంట తీసుకురావాలి.  

పోలింగ్ కేంద్రంలోకి సెల్‌ఫోన్లు, అగ్గిపెట్టెలు, లైటర్లు, వాటర్ బాటిళ్లు, ఇంకు పెన్నులను అనుమతించరు.  

వాహనాలను పోలింగ్ కేంద్రానికి 100 మీటర్ల దూరంలోనే ట్రాఫిక్‌కు ఇబ్బంది లేకుండా నిలపాలి. 100 మీటర్ల పరిధిలో ఎలాంటి ప్రచారం చేయరాదు.  

ఓటు వేసిన వెంటనే పోలింగ్ కేంద్రం వద్ద గుంపులుగా నిలబడకుండా నేరుగా ఇళ్లకు వెళ్లిపోవాలి.  

ఎన్నికలు వస్తుంటాయి, పోతుంటాయని, గ్రామంలో అందరూ కలిసిమెలిసి ఉండాలని హితవు పలికారు. 'ప్రజల భద్రతే మా బాధ్యత - శాంతియుత ఎన్నికలే మా లక్ష్యం' అని పేర్కొంటూ, ప్రశాంతంగా, పారదర్శకంగా ఎన్నికలు జరిగేందుకు ప్రజలంతా పోలీసు శాఖకు సహకరించాలని కోరారు.