ప్రమాదంలో గాయపడిన రైతులకు ఎమ్మెల్యే BLR అండ.. తన వాహనంలో ఆసుపత్రికి తరలింపు
ప్రమాదంలో గాయపడిన రైతులకు ఎమ్మెల్యే BLR అండ.. తన వాహనంలో ఆసుపత్రికి తరలింపు
మిర్యాలగూడ అర్బన్, మేజర్ న్యూస్ : మిర్యాలగూడ మండలంలోని క్రిస్టాపురం గ్రామ సమీప బైపాస్ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బొల్లిగుట్ట తండాకు చెందిన రైతులు ధాన్యంతో ట్రాక్టర్‌పై వెళ్తుండగా, టిప్పర్ లారీ ఢీకొట్టడంతో ట్రాక్టర్ బోల్తాపడింది. ఈ ఘటనలో పలువురు రైతులకు గాయాలయ్యాయి.
అదే మార్గంలో వెళ్తున్న మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి (BLR) ప్రమాదాన్ని గమనించి వెంటనే స్పందించారు. క్షతగాత్రులను తన సొంత వాహనంలో మిర్యాలగూడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించి, సకాలంలో వైద్యం అందేలా చర్యలు తీసుకున్నారు.
అనంతరం ఆసుపత్రి వైద్యులను సంప్రదించి, గాయపడిన రైతులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, వారు త్వరగా కోలుకునేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. ప్రమాదానికి కారణమైన టిప్పర్ లారీపై కేసు నమోదు చేసి, ఘటనకు గల కారణాలపై సమగ్ర విచారణ చేపట్టాలని పోలీసు అధికారులను ఆదేశించారు.
ఆపద సమయంలో మానవతా దృక్పథంతో తక్షణమే స్పందించి క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించడమే కాకుండా, మెరుగైన వైద్యం అందేలా చొరవ చూపిన ఎమ్మెల్యే BLR సేవా నిరతిపై స్థానికులు అభినందనలు వ్యక్తం చేశారు.