telangana
ఘనంగా 'బిర్సా ముండా జయంతి
మల్కాజిగిరి, మేజర్ న్యూస్ : సందర్భంగా సోమ వారం దీన్ దయాళ్ నగర్ లోని వనవాసి కళ్యాణ్ పరిషత్ లో భగవాన్ శ్రీ బిర్సా ముండా జయంతి ఘనంగా నిర్వ హించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కోశాధికారి జీడి బాలచం దర్ గౌడ్ హజరై, ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గిరిజన హక్కులు, సంస్కృతి స్వాతంత్ర్యం కోసం మహనీయుడు భగవాన్ బిర్సా ముండా నిరంతరం పోరాడాడని, ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఆయన చేసిన త్యాగం, చూపిన ధైర్యం, పోరాట స్ఫూర్తి, తన దేశభక్తి భావితరాలకు స్ఫూర్తి దాయకమన్నారు. ఆ మహనీయుని ఆశ యాల సాధనకు ప్రతి ఒక్కరూ అంకితం కావాలని జీడి. బాలచందర్ గౌడ్ పిలుపు నిచ్చారు.