BREAKING
సల్మాన్ ఖాన్ 'మాన్‌స్టర్' 10 రోజుల భారీ యాక్షన్ షెడ్యూల్ షురూ వైద్య రంగంలో విప్లవం ముంబై ప్రయాణికులకు శుభవార్త: రూ. 12,710 కోట్ల పన్వేల్–వసాయ్ రైల్ కారిడార్‌కు రైల్వే బోర్డు గ్రీన్ సిగ్నల్! ఐఎంఏ వివాదం: సన్నీ డియోల్ 'సూర్య: అంత్ సే ఆరంభ్ తక్' విడుదల 2027కి వాయిదా? ఎగ్జిబిషన్ బకాయిల వసూళ్లపై మున్సిపల్ కమిషనర్‌ను నిలదీసిన ఉక్కు ప్రవీణ్! భారత విమానయాన రంగంలో భారీ విస్తరణ... జెన్-జీ బోల్డ్ బిజినెస్ వ్యూహాలు, సోషల్ మీడియా వాస్తవాలు వెల్లడించిన ఖుషి కపూర్ మనవరాలు ఆరాధ్య బచ్చన్ 15వ పుట్టినరోజు: అమితాబ్ బచ్చన్ హృదయపూర్వక ఆశీస్సులు దేశీయ స్టాక్ మార్కెట్ల తాజా అప్‌డేట్: 400 పాయింట్ల లాభంలో సెన్సెక్స్, 11% జంప్ చేసిన ఫస్ట్‌క్రై కాల్పుల ఘటన తర్వాత సోషల్ మీడియాలోకి రీఎంట్రీ ఇచ్చిన టైగర్ ష్రాఫ్: కాల్పుల ఘటన తర్వాత షూటింగ్‌కు తిరిగొచ్చిన టైగర్ ష్రాఫ్.. సిబ్బందికి కీలక ఆదేశాలు! నెపోటిజం చర్చలపై స్పందించిన అనన్య పాండే పి అండ్ టీ కాలనీలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయం శివనామస్మరణ భక్తి శ్రద్ధలతో అయ్యప్ప పడిపూజ -శ్రీ ధర్మ శాస్తా భక్త సేవా సమితి ఆధ్వర్యంలో సాములకు అన్నప్రసాద వితరణ బ్యాంకింగ్ స్టాక్స్‌లో బుల్ జోరు: చారిత్రక గరిష్ఠం 62,000 దాటిన నిఫ్టీ బ్యాంక్!

పి అండ్ టీ కాలనీలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయం శివనామస్మరణ

Select Suryaa Now
 పి అండ్ టీ కాలనీలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయం శివనామస్మరణ

ఖైరతాబాద్ మేజర్ న్యూస్: కార్తీక మాసంలోని పవిత్ర సోమవారాన్ని పురస్కరించుకుని దిల్‌సుఖ్‌నగర్ పి అండ్ టీ కాలనీలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయం శివనామస్మరణతో మార్మోగింది. ఆలయ కార్యనిర్వహణాధికారి రమాదేవి పర్యవేక్షణలో రుద్ర హోమాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. అర్చకుల వేదమంత్రోచ్ఛారణలు, హోమాగ్నికి సమర్పించిన ఆహుతులతో ఆలయ పరిసరాల్లో భక్తిభావం వెల్లివిరిసింది. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని పూజల్లో భాగస్వాములయ్యారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి ఈవో రమాదేవి మాట్లాడుతూ ఆలయంలో ధార్మిక కార్యక్రమాలు నిరంతరం కొనసాగాలంటే భక్తుల సహకారం ఎంతో అవసరమని అన్నారు. భక్తుల ప్రోత్సాహంతోనే ఈ రుద్ర హోమాన్ని నిర్వహించగలిగామని తెలిపారు. కార్తీక మాసం ముగిసే వరకు ప్రతి సోమవారం రుద్ర హోమం నిర్వహించనున్నట్లు ప్రకటించారు. భక్తుల నుంచి మరింత సహకారం లభిస్తే ఆలయంలో అన్ని రకాల హోమాలు, ప్రత్యేక పూజలు నిత్యం నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామని, ఆలయాన్ని మరింత అభివృద్ధి చేసి ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దుతామని ఆమె పేర్కొన్నారు. భక్తుల భాగస్వామ్యమే ఆలయ అభివృద్ధికి ప్రధాన బలమని వివరించారు. ఈ కార్యక్రమంలో విజయదుర్గ ఆలయ ప్రధాన అర్చకులు దివాకర్ శర్మ, శివాలయ ప్రధాన అర్చకులు రాంబాబు శర్మ, రామాలయ ప్రధాన అర్చకులు దీపక్ ఆచార్యులు, వెంకటరమణ, ఆలయ సేవకులు పార్వతి, పవన్, రాఘవతో పాటు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. హోమం విజయవంతం కావడానికి సహకరించిన భక్తులందరికీ ఈవో రమాదేవి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు