telangana
భక్తి శ్రద్ధలతో అయ్యప్ప పడిపూజ -శ్రీ ధర్మ శాస్తా భక్త సేవా సమితి ఆధ్వర్యంలో సాములకు అన్నప్రసాద వితరణ
మల్కాజిగిరి, మేజర్ న్యూస్ : మల్కాజిగిరి బండ చెరువు వద్ద నున్న శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో సోమవారం శ్రీ ధర్మ శాస్తా భక్త సేవా సమితి ఆధ్వర్యంలో 3వ సంవత్సరం అయ్యప్ప దీక్షా దారులకు అన్న ప్రసాద కార్యక్రమం నిర్వహించారు. మండ లం రోజులు ఇక్కడ అయ్యప్ప దీక్షాదారులకు మధ్యాహ్నం పూట అన్నప్రసాదం పంపిణీ జరుగుతుంది. మొదటిరోజు వితరణ ప్రారం భం సందర్భంగా భక్తులందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో అయ్యప్ప పడిపూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మల్కా జిగిరి డివిజన్ మాజీ కార్పొరేటర్ ఊరపల్లి శ్రవణ్, గిరిప్రసాద్, మౌనిష్, గోవర్ధన్, సతీష్, నరేష్, అడ్వకేట్ సింహం, డోలాక్ శ్రీనివాస్, పెరి శ్రీనివాస్ తో పాటుగా అధిక సంఖ్యలో అయ్యప్ప స్వాములు, భక్తులు పాల్గొన్నారు.