BREAKING
ఎగ్జిబిషన్ బకాయిల వసూళ్లపై మున్సిపల్ కమిషనర్‌ను నిలదీసిన ఉక్కు ప్రవీణ్! భారత విమానయాన రంగంలో భారీ విస్తరణ... జెన్-జీ బోల్డ్ బిజినెస్ వ్యూహాలు, సోషల్ మీడియా వాస్తవాలు వెల్లడించిన ఖుషి కపూర్ మనవరాలు ఆరాధ్య బచ్చన్ 15వ పుట్టినరోజు: అమితాబ్ బచ్చన్ హృదయపూర్వక ఆశీస్సులు దేశీయ స్టాక్ మార్కెట్ల తాజా అప్‌డేట్: 400 పాయింట్ల లాభంలో సెన్సెక్స్, 11% జంప్ చేసిన ఫస్ట్‌క్రై కాల్పుల ఘటన తర్వాత సోషల్ మీడియాలోకి రీఎంట్రీ ఇచ్చిన టైగర్ ష్రాఫ్: కాల్పుల ఘటన తర్వాత షూటింగ్‌కు తిరిగొచ్చిన టైగర్ ష్రాఫ్.. సిబ్బందికి కీలక ఆదేశాలు! నెపోటిజం చర్చలపై స్పందించిన అనన్య పాండే పి అండ్ టీ కాలనీలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయం శివనామస్మరణ భక్తి శ్రద్ధలతో అయ్యప్ప పడిపూజ -శ్రీ ధర్మ శాస్తా భక్త సేవా సమితి ఆధ్వర్యంలో సాములకు అన్నప్రసాద వితరణ బ్యాంకింగ్ స్టాక్స్‌లో బుల్ జోరు: చారిత్రక గరిష్ఠం 62,000 దాటిన నిఫ్టీ బ్యాంక్! ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పదో తరగతి పరీక్ష ఫీజుల చెక్కుల పంపిణీ అమెరికా బ్యాంకుల అవుటేజ్ సమగ్ర విశ్లేషణ: జేపీ మోర్గాన్ సాఫ్ట్‌వేర్ బగ్ కారణం.. ఖాతాదారుల డబ్బు పూర్తిగా సురక్షితం! అసలైన బాలీవుడ్ ప్రేమకథలు ఎటు పోయాయి?.. తాప్సీ పన్ను ఆసక్తికర వ్యాఖ్యలు! కిమ్స్‌ కడల్స్‌లో ప్రీ మెచ్యూరిటీ వారోత్సవాలు.. 19న ఉచిత వైద్య శిబిరం

పెన్షన్ల పంపిణీ కార్యక్రమం పెన్షన్ల పెంపుపై ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చాలని డిమాండ్ - ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్

Select Suryaa Now
పెన్షన్ల పంపిణీ కార్యక్రమం పెన్షన్ల పెంపుపై ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చాలని డిమాండ్ - ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్
సికింద్రాబాద్ మేజర్ న్యూస్ : సమాజంలోని వృద్ధులు, మానసిక వికలాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలకు ఆర్ధిక భరోసా కల్పించేది పెన్షన్ కార్యక్రమమని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆయన సోమవారం బేగంపేట లోని మల్టి పర్ఫస్ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని పలువురు మానసిక వికలాంగులు, వితంతు లబ్ధిదారులకు నూతనంగా మంజూరైన పెన్షన్ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ అవసరాల కోసం ఎవరిపై ఆధారపడకుండా ఆర్ధికంగా వారికి అండగా నిలవాలనే ఆలోచనతోనే పెన్షన్ పంపిణీ కార్యక్రమం క్రింద ప్రతినెల ఆర్ధిక సహాయం అందించడం జరుగుతుందని వివరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రయివేటు ఉద్యోగాలు చేసే వారి కుటుంబాలలో పెన్షన్ కు అర్హులైన వారిని అనర్హులుగా పేర్కొంటున్నారని అన్నారు. అదేవిధంగా కొందరు దరఖాస్తు దారుల ఇండ్లకు విచారణకు వెళ్ళిన అధికారులు వారి వద్ద కార్లు ఉంటే కూడా అనర్హులు అంటున్నారని విస్మయం వ్యక్తం చేశారు. అధికారులు, ప్రభుత్వం ఈ విషయంలో పునరాలోచించాలని కోరారు. అంతేకాకుండా మానసిక వికలాంగులకు ప్రస్తుతం చెల్లిస్తున్న 4 వేల రూపాయల పెన్షన్ ను 6 వేలకు, వితంతు, వృద్ధుల పెన్షన్ ను 4 వేల రూపాయల కు పెంచుతామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. మూడేళ్ళు కావస్తున్నా పెన్షన్ సాయాన్ని నేటి వరకు పెంచలేదని విమర్శించారు. అదేవిధంగా ప్రభుత్వం నూతనంగా మానసిక వికలాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలకు మాత్రమే పెన్షన్ లు మంజూరు చేసిందని, వృద్ధులకు ఎప్పుడు ఇస్తారని లక్షలాది మంది ఎదురుచూస్తున్నారని అన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం వెంటనే స్పష్టం చేయాలని అన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ లు పాండు నాయక్, శ్రీదేవి, ప్రేమ్ కుమార్, మాజీ కార్పొరేటర్ లు నామన శేషుకుమారి, టి. మహేశ్వరి, కుర్మ హేమలత, బి ఆర్ ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు అత్తిలి శ్రీనివాస్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, ఆకుల హరికృష్ణ, హన్మంతరావు, నాయకులు టి. శ్రీహరి, గందే నాగులు, కె.కిశోర్, శేఖర్, కూతురు నర్సింహ, కట్టా బలరాం, ఆరీఫ్, అఖిల్, వనం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.