telangana
మోండా మార్కెట్‌లో సీసీ కెమెరాల ప్రారంభం: ప్రజల భద్రతకు ఎంతో దోహదం - ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ
సికింద్రాబాద్ మేజర్ న్యూస్ : ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణలో సీసీ కెమెరాలు ఎంతో దోహదం చేస్తాయని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మోండా మార్కెట్ లో నూతనంగా ఏర్పాటు చేసిన 12 సీసీ కెమెరాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతినిత్యం మార్కెట్ కు వచ్చే వేలాదిమంది వినియోగదారులు, మార్కెట్ లోని వ్యాపారులకు సీసీ కెమెరాల ఏర్పాటు తో ఎంతో మేలు జరుగుతుందని చెప్పారు. ఏమైనా ఘటనలు జరిగితే నిందితులను పట్టుకోవడానికి సీసీ కెమెరాలు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయని పేర్కొన్నారు. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకొని సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన మార్కెట్ కమిటీ సభ్యులను అభినందించారు. అనంతరం మార్కెట్ లో తిరుగుతూ వ్యాపారుల ను పలకరించారు. వ్యాపారాలు ఎలా సాగుతున్నాయి, సమస్యలు ఏమైనా ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో డివిజన్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఆకుల హరికృష్ణ, నాయకులు గందే నాగులు, తలసాని స్కైలాబ్ యాదవ్, కొండాపురం మహేష్ యాదవ్, మార్కెట్ కమిటీ ప్రధాన కార్యదర్శి మధుసూదన్, జయరాజ్, మహేందర్, అమర్ తదితరులు ఉన్నారు