BREAKING
సల్మాన్ ఖాన్ 'మాన్‌స్టర్' 10 రోజుల భారీ యాక్షన్ షెడ్యూల్ షురూ వైద్య రంగంలో విప్లవం ముంబై ప్రయాణికులకు శుభవార్త: రూ. 12,710 కోట్ల పన్వేల్–వసాయ్ రైల్ కారిడార్‌కు రైల్వే బోర్డు గ్రీన్ సిగ్నల్! ఐఎంఏ వివాదం: సన్నీ డియోల్ 'సూర్య: అంత్ సే ఆరంభ్ తక్' విడుదల 2027కి వాయిదా? ఎగ్జిబిషన్ బకాయిల వసూళ్లపై మున్సిపల్ కమిషనర్‌ను నిలదీసిన ఉక్కు ప్రవీణ్! భారత విమానయాన రంగంలో భారీ విస్తరణ... జెన్-జీ బోల్డ్ బిజినెస్ వ్యూహాలు, సోషల్ మీడియా వాస్తవాలు వెల్లడించిన ఖుషి కపూర్ మనవరాలు ఆరాధ్య బచ్చన్ 15వ పుట్టినరోజు: అమితాబ్ బచ్చన్ హృదయపూర్వక ఆశీస్సులు దేశీయ స్టాక్ మార్కెట్ల తాజా అప్‌డేట్: 400 పాయింట్ల లాభంలో సెన్సెక్స్, 11% జంప్ చేసిన ఫస్ట్‌క్రై కాల్పుల ఘటన తర్వాత సోషల్ మీడియాలోకి రీఎంట్రీ ఇచ్చిన టైగర్ ష్రాఫ్: కాల్పుల ఘటన తర్వాత షూటింగ్‌కు తిరిగొచ్చిన టైగర్ ష్రాఫ్.. సిబ్బందికి కీలక ఆదేశాలు! నెపోటిజం చర్చలపై స్పందించిన అనన్య పాండే పి అండ్ టీ కాలనీలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయం శివనామస్మరణ భక్తి శ్రద్ధలతో అయ్యప్ప పడిపూజ -శ్రీ ధర్మ శాస్తా భక్త సేవా సమితి ఆధ్వర్యంలో సాములకు అన్నప్రసాద వితరణ బ్యాంకింగ్ స్టాక్స్‌లో బుల్ జోరు: చారిత్రక గరిష్ఠం 62,000 దాటిన నిఫ్టీ బ్యాంక్!

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పదో తరగతి పరీక్ష ఫీజుల చెక్కుల పంపిణీ

Select Suryaa Now
ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పదో తరగతి పరీక్ష ఫీజుల చెక్కుల పంపిణీ
 సికింద్రాబాద్ మేజర్ న్యూస్ : ఈరోజు బేగంపేటలోని ప్రభుత్వ రౌండ్ టేబుల్ పాఠశాల మరియు పాటిగడ్డలోని బండిమెట్ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న మొత్తం 107 మంది పదో తరగతి విద్యార్థినీ విద్యార్థులకు కేంద్ర బొగ్గు మరియు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి ప్రతి సంవత్సరం అందిస్తున్న సహాయంలో భాగంగా, ఈ సంవత్సరం కూడా వారి పదో తరగతి పరీక్ష ఫీజులకు సరిపడా నగదు చెక్కులను పంపించారు. ఈ చెక్కులను మహంకాళి–సికింద్రాబాద్ జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి నెమలి ఆనంద్ (నందు), స్థానిక బీజేపీ నాయకులతో కలిసి విద్యార్థుల సమక్షంలో ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులైన యాదగిరికి మరియు బి. చంద్రశేఖర్ శర్మకి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి జి. కిషన్ రెడ్డి తరఫున విద్యార్థినీ విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, కష్టపడి చదివి పదో తరగతి పరీక్షల్లో మంచి మార్కులు సాధించి, ఉన్నత విద్యను అభ్యసించి జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పాఠశాలల ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు జి. కిషన్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద విద్యార్థుల విద్యాభివృద్ధికి ఆయన అందిస్తున్న ప్రోత్సాహం, సహకారం ఎంతో అభినందనీయమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో విజయ్ కుమార్, అశోక్ యాదవ్, శ్రవణ్,పాండియన్, దుర్గేష్, ఆనంద్, యాకూబ్ తదితరులూ పాల్గొన్నారు.