అప్పుల బాధతో టైలర్ ఆత్మహత్య
సూర్య జగిత్యాల ప్రతినిధి:అప్పుల బాధతో టైలర్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన జగిత్యాల పట్టణంలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. పట్టణంలోని తీన్‌ఖని చౌరస్తా వద్ద శ్రీరాం టైలర్స్ నిర్వహిస్తున్న శంకర్ (47) మంగళవారం తన దుకాణంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వ్యాపారం సరిగా సాగకపోవడం, అప్పులు పెరిగిపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైనట్లు పోలీసులు తెలిపారు. మృతుడికి భార్య, కుమార్తె ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.