ప్రెస్ క్లబ్ అభివృద్ధి కోసం రూ.5 లక్షలు మంజూరు - భూమిపూజ చేసి పనులు ప్రారంభించిన కలెక్టర్ రాజర్షి షా
సూర్య ఆదిలాబాద్ ప్రతినిధి;జిల్లా కేంద్రంలోని ప్రింట్ మీడియా ప్రెస్ క్లబ్ అభివృద్ధికి జిల్లా కలెక్టర్ రాజర్షి షా ప్రత్యేక చొరవ తీసుకొని రూ.5 లక్షల నిధులు మంజూరు చేయించారు. ఈ నిధులతో ప్రహరీ గోడ, ఫ్లోరింగ్, మరుగుదొడ్ల నిర్మాణం తదితర పనులు చేపట్టనున్నారు. ఈ సందర్భంగా మంగళవారం ప్రెస్ క్లబ్ ఆవరణలో కలెక్టర్ రాజర్షి షా భూమిపూజ నిర్వహించి, కొబ్బరికాయ కొట్టి అభివృద్ధి పనులను ప్రారంభించారు. పనులను నాణ్యతా ప్రమాణాలతో త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. పాత్రికేయుల సంక్షేమం, ప్రెస్ క్లబ్ అభివృద్ధికి జిల్లా యంత్రాంగం తరఫున సహకారం అందిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో మీడియా ప్రతినిధులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.