పొదుపు లేకుంటే అప్పుల ఊబిలో కుటుంబాలు - ఉట్స్ సారంగపల్లిలో ఆర్థిక అవగాహన సదస్సు
సూర్య బెజ్జుర్ : కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా, బెజ్జూర్ మండలం ఉట్స్ సారంగపల్లిలో పొదుపు సంఘాల సభ్యులకు ఆర్థిక పొదుపు, ఆర్థిక ప్రణాళికపై సి ఆర్ పి ఆత్రం శ్రీవిద్య అవగాహన సదస్సు నిర్వహించారు. రోజువారీ కూలి ఆదాయం తక్కువగా ఉండటం, ఆదాయం స్థిరంగా లేకపోవడంతో అధిక వడ్డీలకు అప్పులు తీసుకోవడం, ఆస్తులు తనఖా పెట్టడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయని వివరించారు. పొదుపులు లేకపోవడంతో అనారోగ్యం, వైద్య ఖర్చులు, ప్రకృతి వైపరీత్యాల సమయంలో అప్పుల భారం పెరుగుతోందని తెలిపారు. తక్కువ ఆదాయం ఉన్నప్పటికీ కొంత మొత్తాన్ని క్రమం తప్పకుండా పొదుపు చేయాలని, అవసరాలకు అనుగుణంగా ఆలోచించి ఖర్చు చేయాలని సూచించారు. అధిక వడ్డీ అప్పులకు దూరంగా ఉంటూ ఆర్థిక క్రమశిక్షణ పాటించాలని అవగాహన కల్పించారు.ఈ కార్యకమంలో వి ఓ ఏ కొడప పార్వతి, వి ఓ అధ్యక్షులు కొడప తిరుపతమ్మ,, ఉత్సారంగపల్లి 25పొదుపు సంఘాలు,తదితరులు పాల్గొన్నారు.