పారా క్రీడల్లో మెరిసిన ఎస్‌వీఆర్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థి భరత్ కుమార్- కళాశాల చైర్మెన్ వెంకట రామిరెడ్డి
సూర్య, నంద్యాల బ్యూరో:ఎస్‌వీఆర్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థి భరత్ కుమార్ పారా క్రీడల్లో ప్రతిభ కనబరిచి స్టేట్ మీట్‌కు ఎంపిక కావడం కళాశాలకు గర్వకారణంగా నిలిచింది. ఫెన్సింగ్ విభాగంలో ప్రతిభను చాటుకున్న భరత్ కుమార్ రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక కావడంతో కళాశాల యాజమాన్యం హర్షం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ వెంకటరామిరెడ్డి, డైరెక్టర్ మల్లికార్జునరెడ్డి, ప్రిన్సిపాల్ హరిప్రసాద్ రెడ్డిలువిద్యార్థి భరత్ కుమార్ ను ప్రత్యేకంగా అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ దినేష్ రెడ్డి మాట్లాడుతూ తమ కళాశాల విద్యార్థులకు చదువుతో పాటు క్రీడల్లో కూడా ఎల్లప్పుడూ ప్రోత్సాహం అందిస్తామని తెలిపారు. ప్రతి విద్యార్థి క్రీడల్లో రాణించి, ఉన్నత స్థాయికి చేరుకోవాలని, తద్వారా కళాశాలకు, తల్లిదండ్రులకు, తమ ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. క్రీడాకారులకు అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు కళాశాల యాజమాన్యం ఎల్లప్పుడూ ముందుంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏ ఐ హెచ్ఓడి సుబ్బారెడ్డి, ఫిజికల్ డైరెక్టర్ విల్సన్ కుమార్ లు పాల్గొని భరత్ కుమార్‌ను అభినందించారు.
*మధుబాబు, సూర్య బ్యూరో ఇంచార్జి, నంద్యాల జిల్లా*